Share News

SC INHIBITIONS: ప్రతిబంధకాలను తెంచిన సుప్రీం

ABN , Publish Date - Aug 05 , 2024 | 12:09 AM

ఎస్సీ వర్గీకరణ తీర్పుతో సమాన అవకాశాల సద్వినియోగ ప్రతిబంధకాల్ని సుప్రీం కోర్టు తెంచివేయడం హర్షణీయమని మాదిగల మేధావుల ఫోరం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఫోరం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం క్లాక్‌టవర్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.

SC INHIBITIONS: ప్రతిబంధకాలను తెంచిన సుప్రీం
Leaders of intellectuals forum organizing the rally

అనంతపురం సెంట్రల్‌, ఆగస్టు 4: ఎస్సీ వర్గీకరణ తీర్పుతో సమాన అవకాశాల సద్వినియోగ ప్రతిబంధకాల్ని సుప్రీం కోర్టు తెంచివేయడం హర్షణీయమని మాదిగల మేధావుల ఫోరం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం ఫోరం ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం క్లాక్‌టవర్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఫోరం నాయకులు సతీష్‌ కుమార్‌, మారెప్ప మాట్లాడుతూ ఒకే అంశంపై మూడు దశాబ్దాల పోరాటాన్ని గుర్తించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఎస్సీల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చారని కొనియాడారు. అటెండర్‌ నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌ వరకు వర్గీకరణ అమలుచేయాలని కోరారు. నాయకులు హరిప్రసాద్‌, బాల గంగాధర్‌, తిరుపాలు, శశికల, శంకర్‌, ఎల్‌ఐసీ మారెప్ప, కృష్ణమూర్తి, క్రిష్టప్ప, నారాయణ, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 12:09 AM