Theft ఆరు దుకాణాల్లో చోరీ
ABN , Publish Date - Nov 07 , 2024 | 12:29 AM
మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఉన్న ఆరు దుకాణాల్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అమృత ఫర్టిలైజర్స్, వరవినాయక ఫర్టి లైజ ర్స్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, వినాయక ఏజెన్సీ, ఎర్రిస్వామి కిరాణ జనరల్ స్టోర్, హనుమంతరెడ్డి హార్డ్వేర్ షాప్లో చోరీకి పాల్పడ్డారు.
విడపనకల్లు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఉన్న ఆరు దుకాణాల్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. అమృత ఫర్టిలైజర్స్, వరవినాయక ఫర్టి లైజ ర్స్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, వినాయక ఏజెన్సీ, ఎర్రిస్వామి కిరాణ జనరల్ స్టోర్, హనుమంతరెడ్డి హార్డ్వేర్ షాప్లో చోరీకి పాల్పడ్డారు.
ఆ షాపులకు షెట్టర్లు ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు. అయితే ఎక్కడా పెద్దగా నగదు దొరకలేదు. ఎర్రిస్వామి కిరాణషాపులో రెండు సగరెట్ బండిల్స్, రూ. 16 వందల నగదు ఎత్తుకెళ్లారు. అమృతఫర్టిలైజర్స్లో రూ. 4వేల నగదును, ఇత ర షాపుల్లో అతి తక్కువ మొత్తంలో నగదు దొరకడంతో తీసుకెళ్లారు. అంతా కలిపి రూ.10వేలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఒకే రోజు ఆరు దుఖాణాల్లో చోరీలకు పాల్పడటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ సీఐ చిన్న గౌస్ బాధితులను విచారించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..