మా భూమిని కాజేయాలని చూస్తున్నారు
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:04 AM
తాను కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసేందుకు తాడిమర్రికి చెందిన ఓ వైసీపీ నాయకుడు, అతడి అనుచరుడు ప్రయత్నాలు చేస్తున్నారని రామునాయక్ ఆరోపించారు
అనంతపురం క్రైం, ఫిబ్రవరి 12: తాను కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసేందుకు తాడిమర్రికి చెందిన ఓ వైసీపీ నాయకుడు, అతడి అనుచరుడు ప్రయత్నాలు చేస్తున్నారని రామునాయక్ ఆరోపించారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని వాపోయారు. సోమవారం అనంతపురం నుంచి బైక్‌లో మిత్రుడు నరేష్‌తో కలిసి తాడిమర్రికి వెళ్తుండగా ఉప్పరపల్లి క్రాస్ సమీపంలో ఆటో ఢీకొంది. గాయపడిన రామునాయక్, నరేష్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామునాయక్ మీడియాతో మాట్లాడుతూ... తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన తాను 2021 డిసెంబరులో రూ.29 లక్షలు పెట్టి ఊరి సమీపంలోని 3.84 ఎకరాలు కొనుగోలు చేశానన్నారు. అనంతపురం నగర శివారులోని శిల్పా లేపాక్షి టౌనషిప్‌లో నివాసం ఉంటున్నానన్నారు. ఆ భూమిని కబ్జా చేయడానికి వైసీపీ నాయకుడు, అతడి అనుచరుడు రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీలు చేయడానికి పలుసార్లు పిలిచారన్నారు. ఆ భూమిని లాక్కోవడానికి మూడు రోజుల నుంచి పోలీసులతో సైతం ఒత్తిడి పెట్టి పంచాయితీకి పిలుపిస్తున్నారన్నారు. పోలీసులు ఫోన చేసి, తన వద్ద ఉన్న డాక్యు మెంట్లు తీసుకురావాలని చెప్పారన్నారు. సోమవారం ఎవరో పోలీసు సిబ్బంది వరుసగా ఫోన చేస్తే.. టీవీ టవర్ వద్ద వెళ్తున్నానని చెప్పానన్నారు. అనంతపురం వెళ్లి జిరాక్స్ తీసు కుని ఉప్పరపల్లి క్రాస్ సమీపంలో వెళ్తుండగా ఒక ఆటో ఢీ కొందనీ, దీంతో కళ్లు తిరిగి పడిపో యాయన్నారు. సమీపంలో మరో ఆటో ఉండ టంతో హత్యాయత్నమేనని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం తాములేని సమయంలో పొలం వద్దకు వెళ్లిన వైసీపీ నాయకుడి అనుచ రుడు ‘కంచె తీసేస్తామనీ, ఎవరైనా వస్తే నరుకు తామని’ హెచ్చరించినట్లు తెలిసిందన్నారు. వారి నుంచి ప్రాణహాని ఉందని... రక్షణ కల్పించాలని రామునాయక్ కోరాడు.