Share News

JAGANNA COLONYS : గోరంత పెట్టి..కొండంత దోచేశారు

ABN , Publish Date - Jul 07 , 2024 | 11:49 PM

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు భూ సేకరణ పేరుతో రూ.కోట్లు దోచేశారు. వైసీపీ నాయకులు ముందుగానే ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి తక్కువ ధరలకే భూమిని కొనుగోలు చేసి, దాన్ని భూసేకరణలో భాగంగా ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి అప్పగించారు. పట్టణంలోని పేదల కోసం చాబాల రోడ్డులో ఐదెకరాలు, హోతూరు రోడ్డులో రెండెకరాలు, గురుకుల పాఠశాల సమీపంలో నాలుగెకరాల భూమిని వైసీపీ ప్రభుత్వంలో సేకరించారు. మూడేళ్ల కిందట పట్ణణ శివారులోని చాబాల-హోతూరు, జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాల ప్రాంతంలో 603మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వైసీపీ ...

JAGANNA COLONYS : గోరంత పెట్టి..కొండంత దోచేశారు
Only one completed house in Chabala layout

జగనన్న కాలనీల భూసేకరణలో అక్రమాలు

లక్షల ప్రజాధనం కొల్లగొట్టిన వైసీపీ నాయకులు

అనువుగాని చోట జగనన్న లేఅవుట్‌లు

ఉరవకొండ, జూలై 7: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు భూ సేకరణ పేరుతో రూ.కోట్లు దోచేశారు. వైసీపీ నాయకులు ముందుగానే ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి తక్కువ ధరలకే భూమిని కొనుగోలు చేసి, దాన్ని భూసేకరణలో భాగంగా ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి అప్పగించారు. పట్టణంలోని పేదల కోసం చాబాల రోడ్డులో ఐదెకరాలు, హోతూరు రోడ్డులో రెండెకరాలు, గురుకుల పాఠశాల సమీపంలో నాలుగెకరాల భూమిని వైసీపీ ప్రభుత్వంలో సేకరించారు. మూడేళ్ల కిందట పట్ణణ శివారులోని చాబాల-హోతూరు, జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాల ప్రాంతంలో 603మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. వైసీపీ


నాయకులకి లబ్ధి చేకూర్చేందుకు ఎకరా రూ.ఐదు లక్షలు కూడా చేయని భూమిని, ఇళ్లస్థలాల కోసం ఎకరా భూమిని ప్రభుత్వం రూ.28లక్షలకు కొనుగోలు చేసింది. అక్కడ జగనన్న లేఅవుట్‌లో 269మందికి పట్టాలు ఇచ్చారు. గరుకుల పాఠశాల సమీపంలో మూడు నెలల కిందటే కొందరి నుంచి భూమిని కొనుగోలు చేశారు. వారికి ఎకరాకు రూ.8లక్షలు ఇచ్చి ప్రభుత్వానికి మాత్రం ఎకరా రూ.32లక్షలకు విక్రయించారు. ఇక్కడ అంతా తెలిసినా అధికారులు అధిక ధరలు చెల్లించి భూసేకరణ చేయడం గమనార్హం. చాబాల- హోతూరు రోడ్డులో సేకరించిన భూమి ఇళ్లు నిర్మించడానికి అనువుగా లేదు. దీంతో మూడేళ్లలో ఒక ఇల్లు మాత్రమే నిర్మించారు.

విచారణ చేపట్టాలి

జగనన్న కాలనీల భూసేకరణపై సమగ్ర విచారణ చేపట్టాలి. గత వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేలా భూసేకరణ చేసింది. ఎకరా రూ. ఐదు లక్షలు చేయని భూములకు రూ.30 లక్షలు చెలించారు. ప్రజా ధనాన్ని అప్పనంగా కొల్లగొట్టారు.

- ప్రభాకర్‌, వార్డుసభ్యుడు

అనువుగాని చోట ఇళ్ల పట్టాలు

జగనన్న కాలనీల పేరుతో లబ్ధిదారులకు అనువుగాని చోట ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. పట్టణానికి 2.కి.మీ దూరంలో, శ్మశానానికి దగ్గరలో పట్టాలు పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు. హోతూరు లేఅవుట్‌లో వర్షాలు వస్తే నీరు నిల్వ ఉంటోంది.

- గోవిందు, ఉరవకొండ


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 07 , 2024 | 11:49 PM