KALAVA :ఈవీఎంల ఆలస్యంతో ఓటర్లకు ఇబ్బంది
ABN , Publish Date - May 14 , 2024 | 12:52 AM
ఈవీఎంలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ఓటర్లను ఇబ్బంది పెట్టినట్లేనని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. సోమవారం పోలింగ్ సందర్భంగా మండలంలోని దర్గాహోన్నూరు, గోవిందవాడ, బండూరు, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్, నేమకల్లులలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
కూటమి అభ్యర్థి కాలవ
బొమ్మనహాళ్, మే 13: ఈవీఎంలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల ఓటర్లను ఇబ్బంది పెట్టినట్లేనని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. సోమవారం పోలింగ్ సందర్భంగా మండలంలోని దర్గాహోన్నూరు, గోవిందవాడ, బండూరు, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్, నేమకల్లులలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ నమోదుపై అధికారులను ఆరాతీశారు. పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటుహక్కును ఉదయం 7 గంటలకే వినియోగించుకుంటున్నారని తెలిపారు.
చాలా చోట్ల ఈవీఎంలు ఆలస్యంగా పనిచేస్తున్నాయని దీంతో ఓటింగ్ ఆలస్యంగా జరుగుతోందన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో 50 వేల మెజార్టీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సింగల్ విండో మాజీ అధ్యక్షులు కొత్తపల్లి మల్లికార్జున, మాజీ జడ్పీటీసీ కుమ్మరి మల్లికార్జున, తిమ్మరాజు, అప్పారావు, కేశప్ప, మహేంద్ర, పయ్యావుల మోహనబాబు, పయ్యావుల అనిల్, పయ్యావుల నాగరాజు పాల్గొన్నారు.