Share News

ACCIDENT : రెండు లారీలు ఢీ

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:59 PM

మండలంలోని వెంకటరెడ్డిపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై పుట్టపర్తికి వెళ్లే బ్రిడ్జి సమీపంలో మంగళవారం రాత్రి ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్నాయి. ప్రమాదంలో డ్రైవర్‌ గొల్ల శ్రీనివాసులు(30) మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైనట్లు కియ ఏఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం కో లార్‌ జిల్లా మాలూరు తాలూకాకు చెందిన లారీ డ్రైవర్‌ గొల్ల శ్రీనివాసులు, క్లీనర్‌ ముస్తఫా కలిసి కోలార్‌ నుంచి రాయ చూర్‌కు లారీలో టమోటా లోడ్‌తో బయలు దేరారు. ఈ క్రమంలో పెనుకొండ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది.

ACCIDENT : రెండు లారీలు ఢీ
Lorries damaged in an accident

ఒకరి మృతి... ముగ్గురికి గాయాలు

పెనుకొండ రూరల్‌, జూలై31: మండలంలోని వెంకటరెడ్డిపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై పుట్టపర్తికి వెళ్లే బ్రిడ్జి సమీపంలో మంగళవారం రాత్రి ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్నాయి. ప్రమాదంలో డ్రైవర్‌ గొల్ల శ్రీనివాసులు(30) మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైనట్లు కియ ఏఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం కో లార్‌ జిల్లా మాలూరు తాలూకాకు చెందిన లారీ డ్రైవర్‌ గొల్ల శ్రీనివాసులు, క్లీనర్‌ ముస్తఫా కలిసి కోలార్‌ నుంచి రాయ చూర్‌కు లారీలో టమోటా లోడ్‌తో బయలు దేరారు. ఈ క్రమంలో పెనుకొండ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ సమయంలో వాహనం ఎడమ నుంచి కుడివైపునకు వెళ్లి హైదరాబాద్‌ నుంచి బెంగళూ రుకు బంగాళదుంపలతో వెళ్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో టమోటా లారీ డ్రైవర్‌ శ్రీనివాసులు అక్కడి కక్కడే మృతిచెందగా, రెండు లారీల క్లీనర్లు ముస్తఫా, శీను, బంగాళాదుంపల లారీ డ్రైవర్‌ శ్రీరామ్‌ గాయపడ్డారు. వారిని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివా సులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నార న్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 31 , 2024 | 11:59 PM