POWER CUT: అప్రకటిత విద్యుత కోతలు..!
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:52 PM
అప్రకటిత విద్యుత కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రోజు అంటే మరమ్మతులు ఉంటాయిలే అనుకోవచ్చు, వారం రోజులుగా ఉదయం నిద్ర నుంచి లేవకముందు నుంచే కరెంటు కోతలు ప్రారంభమౌతాయు.
రోజూ 15 సార్లకుపైగా అంతరాయం
మండిపడుతున్న ప్రజలు
హిందూపురం అర్బన, జూన 7: అప్రకటిత విద్యుత కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రోజు అంటే మరమ్మతులు ఉంటాయిలే అనుకోవచ్చు, వారం రోజులుగా ఉదయం నిద్ర నుంచి లేవకముందు నుంచే కరెంటు కోతలు ప్రారంభమౌతాయు. 10 నుంచి 15 సార్లు కరెంటు పోవడం కొంత సమయం తరువాత రావడం పరిపాటిగా మారింది. ఈ సమయంలో కరెంటు పోతుందని తెలిపితే కరెంటు ఉన్న సమయంలో పనులు చేసుకుంటామని అంటున్నారు. అలా కాకుండా ఎడా పెడా కోతలు విధిస్తుంటే ఇబ్బందిగా మారిందన్నారు. వారానికి ఒక రోజు మెయింటెనెన్స అంటూ ఉదయం నుంచి సాయంత్రం దాకా కరెంటు తీసేస్తున్నారు. దీనికి తోడు మరమ్మతులు పేరుతో విద్యుతను తీసేస్తున్నారు. సంబంధిత అధికారులను అడిగితే విద్యుత తీగలపై ఉడతలు సంచరించడం, పాములు, బల్లులు ట్రాన్సఫార్మర్‌లలోకి దూరడం వంటివి జరగడంతో సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు అవి కూడా జరుగలేదు. మరి ఎందుకు విద్యుత తరచూ పోతూ వస్తోందని ప్రశ్నిసే ట్రిప్ అవుతా ఉందని, వర్షాల కారణంగా విద్యుత ఆలస్యం అవుతోందని సమాధానమిస్తున్నారు. ఇప్పటికైనా వి ద్యుత అధికారులు స్పం దించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం:
భూపతి, డీఈఈ, హిందూపురం
ఎండలు ఎక్కువగా ఉండటంతో ఇన్సులేటర్లు నెర్రలు బారాయి. వర్షాలు రావడంతో ఎర్రలు బారిన ఇన్సులేటర్లలో నీరు పోవడంతో అవి పగలి పోతున్నాయి. దగ్గరా వెళ్లి గమనించినా అవి కనపడవు. వర్షాకాలం కావడంతో ఇబ్బందుల ఎదురవుతున్నాయి. ప్రస్తుతం పట్టణ ఫీడర్ నుంచి విద్యుత అందిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అలా తీసుకోవాలంటే రైల్వేట్రాక్ క్రాస్ చేయాల్సి ఉంది. రైల్వే అధికారులు అనుమతి కోసం కోసం ప్రయత్నిస్తున్నాం. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం.