Share News

SCHOOL BUS FITNESS: ఫిట్‌నెస్‌ లేని స్కూల్‌ బస్సులను సీజ్‌ చేయాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:20 AM

జిల్లాలో ఫిట్‌నెస్‌ లేకుండా తిరుగుతున్న స్కూల్‌ బస్సులను వెంటనే సీజ్‌ చేయాలని పీఎ్‌సఎ్‌ఫఐ, ఆర్‌ఎ్‌సవైఎఫ్‌ సంఘాల నాయకులు ఉప రవాణాశాఖాధికారిని కోరారు. గురువారం ఆర్ట్టీవోను ఆ సంఘాల నాయకులు కలిశారు.

SCHOOL BUS FITNESS: ఫిట్‌నెస్‌ లేని స్కూల్‌ బస్సులను సీజ్‌ చేయాలి
Leaders of student unions petitioning RTO

అనంతపురం విద్య, జూలై 25: జిల్లాలో ఫిట్‌నెస్‌ లేకుండా తిరుగుతున్న స్కూల్‌ బస్సులను వెంటనే సీజ్‌ చేయాలని పీఎ్‌సఎ్‌ఫఐ, ఆర్‌ఎ్‌సవైఎఫ్‌ సంఘాల నాయకులు ఉప రవాణాశాఖాధికారిని కోరారు. గురువారం ఆర్ట్టీవోను ఆ సంఘాల నాయకులు కలిశారు. పీఎ్‌సఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్‌ ఆలం, ఆర్‌ఎ్‌సవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు అరుణ్‌ మాట్లాడుతూ జిల్లాలో అనేక కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్ల నిర్వాహకులు, ఇంజనీరింగ్‌ కళాశాలల బస్సుల్లో చాలావాటిని ఫిట్‌నెస్‌ లేకున్నా తిప్పుతున్నారన్నారు. బస్సుల్లో సామర్థ్యానికి మించి విద్యార్థులను నింపి నడపుతున్నారన్నారు. ఫిట్‌నెస్‌, పర్మిట్‌లు లేకున్నా వాటిని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మాత్రం లక్షలాది రూపాయలు ఫీజులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఫీజులు గుంజుతున్నారు కానీ.... బస్సుల కండీషన పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆయా సంఘాల నేతలు ప్రతిభ భారతి, నవీన, భీమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:20 AM