CHECK POST : నిరుపయోగంగా చెక్‌పోస్టు బాక్సులు
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:35 AM
ఇసుక, మద్యం అక్రమ రవాణా అరికట్టాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం సరిహద్దు గ్రామాల్లోని ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన విద్యుత బిల్లులు రూ.1.10 లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారు. సరిహద్దు గ్రామాల్లో ఇసుక, మద్యం అక్రమ రవాణా అరికట్టడం కోసం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. మండలంలోని గౌడనహళ్లి, క్యాంపురం, గౌరిపురం, ఆర్ అనంతపురం, పాపసానిపల్లి, యు రంగాపురం మణూ రు, చందకచర్ల గ్రామాల్లో సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటుచేసి సిబ్బందిని నియమించారు.
అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన వైనం
విద్యుత బకాయిలు రూ.1.10 లక్షలు
మడకశిర రూరల్, జూన 6: ఇసుక, మద్యం అక్రమ రవాణా అరికట్టాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం సరిహద్దు గ్రామాల్లోని ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన విద్యుత బిల్లులు రూ.1.10 లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారు. సరిహద్దు గ్రామాల్లో ఇసుక, మద్యం అక్రమ రవాణా అరికట్టడం కోసం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. మండలంలోని గౌడనహళ్లి, క్యాంపురం, గౌరిపురం, ఆర్ అనంతపురం, పాపసానిపల్లి, యు రంగాపురం మణూ రు, చందకచర్ల గ్రామాల్లో సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటుచేసి సిబ్బందిని నియమించారు.
సిబ్బంది రాత్రిళ్లి కూడా విధులు నిర్వహిస్తుండడంతో వాటికి విద్యుత కనెక్షన్లు ఇచ్చి మీటర్లు బి గించారు. ప్రభుత్వం యేడాదిపాటు వాటిని నిర్వహించి, అనం తరం వాటిని ఎత్తివేసింది. అందుకు సంబంధించి ప్రభుత్వం రూ.1.10 లక్షలు విద్యుత బిల్లులను ఆ శాఖకు చెల్లించాల్సి ఉంది. మూడేళ్లు అయినా చెల్లించలేదు. విద్యుత మీటర్లు మాత్రం చెక్‌పోస్టు బాక్స్‌లకు వేలాడుతున్నాయి. చాల చోట్ల విద్యుత వైర్లను ఎత్తుకెళ్లారు. మరి కొన్ని చోట్ల చెక్‌పోస్టు బాక్స్‌లు అసాంఘిక కార్యకలపాలకు నిలయంగా మారినట్లు ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. దీనిపై స్థానిక విద్యుత శాఖ ఏఈ మహేంద్రను వివరణ కోరగా.. సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటుచేసిన అధికారులు చెబితే చెక్ పోస్టులకు ఉన్న విద్యుత కనెక్షన్లు తొలగిస్తామని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....