Share News

VACCINE : టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి

ABN , Publish Date - May 17 , 2024 | 12:17 AM

అరవైఏళ్లు పైబడిన టీబీ వ్యాధిగ్రస్థులు త ప్పనిసరిగా బీసీ జీ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని డీఎంహెచఓ మంజువాణి సూచిం చారు. ఆమె గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీచేసి బీజీజీ టీకాపై అధికారులకు అవగాహన కల్పించారు. ఇదివర కే టీబీ సోకిన చక్కెర వ్యాధి గ్రస్థులు, ధూమపానం చేయువారు, బాడి మాస్‌ ఇండెక్స్‌ 18కన్నా తక్కువ ఉన్నవారు టీకా తీసుకోవచ్చన్నారు.

VACCINE : టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి
DMHO Manjuvani is spreading awareness about BCG vaccine

టీబీ రోగులకు డీఎంహెచఓ సూచన

రొద్దం, మే 16 : అరవైఏళ్లు పైబడిన టీబీ వ్యాధిగ్రస్థులు త ప్పనిసరిగా బీసీ జీ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని డీఎంహెచఓ మంజువాణి సూచిం చారు. ఆమె గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీచేసి బీజీజీ టీకాపై అధికారులకు అవగాహన కల్పించారు. ఇదివర కే టీబీ సోకిన చక్కెర వ్యాధి గ్రస్థులు, ధూమపానం చేయువారు, బాడి మాస్‌ ఇండెక్స్‌ 18కన్నా తక్కువ ఉన్నవారు టీకా తీసుకోవచ్చన్నారు.


ఈ వ్యాధిగ్రస్థులను గ్రామీన ప్రాంతాల్లో గుర్తించి తప్పనిసరిగా టీకా తీసుకోవాలని అధికారులను సూచించారు. వైద్యాధికారి రమ్య, ప్రవీణ్‌కుమార్‌, ఎంపీహెచఈ ఓ సుదర్శనబాబు, ఎంఎల్‌హెచపీ ప్రమీళ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అగళి: మండలంలోని అన్ని గ్రామాల్లో టీబీ వ్యాధిగ్రస్థులను గుర్తించి వా రికి బీసీజీ టీకా వేయనున్నట్లు డాక్టర్‌ శివానంద గాయత్రి తెలిపారు. మం డలంలోని ఆలూడి గ్రామ సచివాలయంలో గురువారం 41మందికి బీసీజీ వ్యాక్సిన వేసినట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో టీబీ వ్యాధి గ్రస్థులను గుర్తించేందుకు వైద్య పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. వారం దరికీ ఈ టీకా వేస్తామని తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. టీబీతో పాటు షుగర్‌ తదితర వ్యాధులు ఉన్నవారిని గుర్తించి టీకా వేసేందుకు వైద్య పరీక్షలు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సూపర్‌ వైజర్‌ నర్సారెడ్డి, హెల్త్‌ అసిస్టెంట్‌లు సుందరయ్య, భిక్షపతి, నవీన, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 17 , 2024 | 12:18 AM