VermiCompost చెత్త ప్రభుత్వం తెచ్చిన కష్టాలు తీరుతున్నాయ్
ABN , Publish Date - Dec 23 , 2024 | 11:39 PM
వైసీపీ చెత్త ప్రభుత్వం వల్ల వచ్చిన కష్టాలు తీరుతున్నాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని తుమ్మల గ్రామంలో మరమ్మతులు పూర్తయిన వర్మీకంపోస్టు యార్డును మంత్రి ప్రారంభించారు.
మంత్రి సత్యకుమార్ యాదవ్
ధర్మవరంలో వర్మీకంపోస్టు యార్డు ప్రారంభం
ధర్మవరం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ చెత్త ప్రభుత్వం వల్ల వచ్చిన కష్టాలు తీరుతున్నాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని తుమ్మల గ్రామంలో మరమ్మతులు పూర్తయిన వర్మీకంపోస్టు యార్డును మంత్రి ప్రారంభించారు. అలాగే దాదాపు రూ.2.23 కోట్లతో మరో యార్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ధర్మవరం మున్సిపాలిటీకి సంబంధించిన వర్మీకంపోస్టు యార్డు నిరుపయోగంగా మారిందన్నారు. ప్రస్తుతం మరమ్మతులు పూర్తి చేసి, పునఃప్రారంభిస్తున్నామన్నారు. దీంతో ఏడాదిలో 40 టన్నుల దాకా సేంద్రీయ ఎరువు తయారవుతుందన్నారు. తద్వారా మున్సిపాలిటీకి రూ.14లక్షల ఆదాయం సమకూరుతుందని మంత్రి వివరించారు. కార్యక్రమంలో టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మదుసూదన రెడ్డి, ఆర్డీఓ మహేశ, కమిషనర్ ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.