Share News

KESHAV: పదవుల కోసమే పార్టీలు మారిన విశ్వ

ABN , Publish Date - May 06 , 2024 | 11:25 PM

స్వార్థ రాజకీయాలు, పదవుల కోసం వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి పార్టీలు మారారని, ప్రజలకు చేసిందేమీలేదని టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ అన్నారు. నియోజకవర్గంలోని వెలిగొండ, చిన్నహోతూరు, పెద్దహోతూరు, కొనకొండ్ల గ్రామాలలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాలలో కేశవ్‌కు మహిళలు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు.

KESHAV: పదవుల కోసమే పార్టీలు మారిన విశ్వ
గడేహోతూరు రోడ్‌షోలో పయ్యావుల

టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, మే 6: స్వార్థ రాజకీయాలు, పదవుల కోసం వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి పార్టీలు మారారని, ప్రజలకు చేసిందేమీలేదని టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ అన్నారు. నియోజకవర్గంలోని వెలిగొండ, చిన్నహోతూరు, పెద్దహోతూరు, కొనకొండ్ల గ్రామాలలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాలలో కేశవ్‌కు మహిళలు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు. వెలిగొండ గ్రామంలో ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. 30 రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తున్నాయని కేశవ్‌ దృష్టికి గ్రామస్థులు తీసుకెళ్లారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సైకిల్‌ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి పొత్తుతో మీ ముందుకు వస్తున్నామన్నారు. హెచఎనఎ్‌సఎ్‌స రూపకర్త ఎన్టీఆర్‌ అన్నారు. రేయింబవళ్లు పనిచేసి కాలువలకు నీరు ఇచ్చామన్నారు.


తవ్విన కాలువలకు సాగునీరు ఇవ్వలేని అసమర్థుడు విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఐదేళ్లలో హంద్రీనీవా కాలువలో తట్టెడు మట్టి అయినా తీయలేదన్నారు. వైసీపీ నాయకులు మట్టిని దోచేసి, అమ్మి సొమ్ము చేసుకున్నారన్నారు. వెలిగొండలో కాలనీకి నీళ్లు అడిగినందుకు దళితులపై దాడి చేశారన్నారు. ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వనందుకు వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో భూములను లాక్కునేందుకు వైసీపీ ప్రభుత్వం చట్టం తెచ్చిందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. బీసీల పార్టీ టీడీపీనే అన్నారు. ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ దేవినేని పురుషోత్తం, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రేగాటి నాగరాజు, మండల కన్వీనర్లు నూతేటి వెంకటేష్‌, విజయ్‌భాస్కర్‌, మాజీ ఎంపీపీ నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు తిప్పన్న, వన్నూరుస్వామి, తట్రగల్లు సుధాకర్‌, ఈశ్వరయ్య, రవి, తిమ్మప్ప, కుమార్‌, గురు,చిన్నరాయుడు, సిద్ధప్ప పాల్గొన్నారు.


టీడీపీలోకి చేరిన వైసీపీ వార్డు సభ్యులు: ఉరవకొండ మేజరు పంచాయతీ అధికారపార్టీకి చెందిన వార్డు సభ్యులు టీడీపీలోకి చేరారు. వజ్రకరూరు మండలం చిన్నహోతూరులో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ సమక్షంలో వార్డు సభ్యులు చేజాల ప్రభాకర్‌, రవి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పయ్యావుల కేశవ్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Updated Date - May 06 , 2024 | 11:25 PM