KESHAV CAMPAIN: కాలువలకు నీళ్లు ఇవ్వలేని నాయకుడు విశ్వ
ABN , Publish Date - May 03 , 2024 | 12:07 AM
తవ్విన కాలువలకు తూములెత్తి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అని ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ విమర్శించారు. మండలంలోని కోనాపురం, చిన్నముష్టూరు, లత్తవరం, లత్తవరం తండా, షేక్షానుపల్లి, రాచర్ల, రాచర్ల తండా గ్రామాలలో గురువారం కేశవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఉరవకొండ, మే 2: తవ్విన కాలువలకు తూములెత్తి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అని ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ విమర్శించారు. మండలంలోని కోనాపురం, చిన్నముష్టూరు, లత్తవరం, లత్తవరం తండా, షేక్షానుపల్లి, రాచర్ల, రాచర్ల తండా గ్రామాలలో గురువారం కేశవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులతో స్వాగతం పలికారు. నాయకులు గజమాలతో సత్కరించారు. కేశవ్ మాట్లాడుతూ పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలన్నారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ఐదేళ్లలో విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. సూపర్‌సిక్స్ పథకాలతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తల్లికి వందనం పథకం కింద ఎంత మంది చదువుతున్న పిల్లలున్నా రూ.15వేలు ఇస్తామన్నారు. మండల కన్వీనర్ విజయ్‌భాస్కర్, పురుషోత్తం, మాజీ ఎంపీపీలు కుళ్లాయప్ప, నాగేశ్వరరరావు, మాజీ సర్పంచు గోవిందు, నెట్టెంరాంబాబు, మదమంచి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ వన్నూరుస్వామి, ఓబన్న పాల్గొన్నారు.
దుర్మార్గపు పాలనను సాగనంపేందుకు సిద్ధం: రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టణంలోని వీరశైవ కల్యాణమండపంలో జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి కేశవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వైసీపీని సాగనంపాలన్నదే కూటమి లక్ష్యమన్నారు. ప్రతిపక్ష ఓట్లు చీలకూడదన్న లక్ష్యంతోనే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం నిలబడిన వ్యక్తి పవనకల్యాణ్ అన్నారు. వైసీపీ నాయకుల వేధింపులతో పరిశ్రమలు జిల్లా నుంచి తరలిపోయాయన్నారు. జనసేన నియోజకవర్గ ఇనచార్జి గౌతమ్‌కుమార్, టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు రేగాటి నాగరాజు, జనసేన నాయకులు చంద్రశేఖర్, కేశవ, గోపాల్, నగేష్, రాజేష్, దేవేంద్ర పాల్గొన్నారు. వజ్రకరూరు మండలంలోని గూళ్లపాళ్యం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు.
కూడేరు: మండల పరిధిలోని ఇప్పేరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నుంచి పయ్యావుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. చేరిన వారిలో కందేపల్లి చిన్నకేశవులు, కందేపల్లి ఈశ్వరయ్య, కందేపల్లి మారుతీ టీడీపీలో చేరారు.