Colonies Visit కాలనీల్లో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన పర్యటన
ABN , Publish Date - Nov 07 , 2024 | 12:27 AM
పట్టణంలోని సంజీవనగర్, విజయనగర్ కాలనీ, టైలర్స్‌కాలనీ, జయనగర్‌కాలనీ, సీపీఐకాలనీ, సుంకులమ్మపాలెం, పోరాటకాలనీలలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి బుధవారం పర్యటించారు.
తాడిపత్రి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సంజీవనగర్, విజయనగర్ కాలనీ, టైలర్స్‌కాలనీ, జయనగర్‌కాలనీ, సీపీఐకాలనీ, సుంకులమ్మపాలెం, పోరాటకాలనీలలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి బుధవారం పర్యటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 15వ ఆర్థికసంఘం నిధుల కింద దాదాపు రూ.2కోట్ల వ్యయంతో కాలనీల్లో సీసీరోడ్లను వేయడానికి పర్యవేక్షించడం జరిగిందన్నారు. అలాగే నీటిపైప్లైన, అండర్పైప్లైన ఏర్పాటుకు కూడా రూ.2.35కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అండర్‌గ్రౌండ్ పైపులైను వేసిన అనంతరం రోడ్ల పనులు మొదలుపెడతామని అన్నారు. తాడిపత్రిలో సీసీ రోడ్లులేని వీధులు ఉండకూడదన్నారు. అలాగే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో ప్రజలు ఎమ్మెల్యే కు, మున్సిపల్ చైర్మనకు ఘనస్వాగతం పలికారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, డీఈ రాంప్రసాద్, ఏఈలు ఆయావార్డు కౌన్సిలర్లు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..