Share News

ASMITH CAMPAIN: అభివృద్ధి చేసేవారికి ఓటు వేయండి: అశ్మితరెడ్డి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:55 AM

గ్రామాలను అభివృద్ధిచేసే వారికి ఎన్నికల్లో ఓటు వేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని రామరాజుపల్లి, తూట్రాళ్లపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాల్లో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ASMITH CAMPAIN: అభివృద్ధి చేసేవారికి ఓటు వేయండి: అశ్మితరెడ్డి
మాట్లాడుతున్న జేసీ దివాకర్‌రెడ్డి

యాడికి, ఏప్రిల్‌ 26: గ్రామాలను అభివృద్ధిచేసే వారికి ఎన్నికల్లో ఓటు వేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని రామరాజుపల్లి, తూట్రాళ్లపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో గ్రామాల్లో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. జనసేన నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, బీజేపీ నాయకుడు రంగనాథ్‌, టీడీపీ మండల కన్వీనర్‌ రుద్రమనాయుడు, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, నాయకులు పరిమి చరణ్‌, శ్యాంసుందర్‌, నాగరాజుగౌడ్‌, సురేష్‌, రమేష్‌, బాబు, హరి, చలమారెడ్డి, రవికుమార్‌రెడ్డి, సుధాకర్‌, శ్రీహరి పాల్గొన్నారు.


అభివృద్ధి చేసుకుందాం.. కలిసి రండి

యాడికి: ఆర్యవైశ్యులు ఎంతో సౌమ్యులని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కలిసి రావాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యాడికిలో ఆయన విస్తృతంగా పర్యటించారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. వీటిని చక్కదిద్దుకోవడానికి అంతా కలిసికట్టుగా ముందుకువచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి గెలుపునకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఆర్యవైశ్యులు మద్దాల సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్‌గుప్త, దేవిశెట్టి బ్రదర్స్‌, తొమ్మాండ్రు చంద్ర తదితరులు పాల్గొన్నారు. జానపాటి రాజు, కేశవ, మాబు సాబ్‌ తదితర గ్రామస్తుల ఇళ్లవద్దకు వెళ్లి కూటమి అభ్యర్థి గెలుపుకు సహకరించాలని కోరారు. రాయలచెరువులో పారిశ్రామిక వేత్త సీవీ రమణారెడ్డిని ఇంటివద్దకు వెళ్లి కలిశారు.


తాడిపత్రిటౌన: మండలంలోని కొనుగుంటపల్లి, కొట్టాలపల్లి, దిగువపల్లి, ఎగువపల్లి గ్రామాల్లో శుక్రవారం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పర్యటించారు. సైకిల్‌ గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని ప్రజలను కోరారు.

సైకిల్‌గుర్తుకు ఓటువేసి గెలిపించండి: సైకిల్‌ గుర్తుకు ఓటువేసి కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన మేనల్లుడు గుణపాటి విరాజ్‌రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం పట్టణంలోని పాలస్టోర్‌, మెయినబజారు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Apr 27 , 2024 | 12:55 AM