Share News

GUMMANURU: రాషా్ట్రభివృద్ధి కోసం టీడీపీకి ఓటెయ్యండి: గుమ్మనూరు

ABN , Publish Date - May 03 , 2024 | 12:04 AM

రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీకి ఓటేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని గుమ్మనూరు జయరాం ఓటర్లను కోరారు. పట్టణంలోని 29, 30 వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఓఓటర్లకు కరపత్రాలను అందజేశారు. రాషా్ట్రభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలకు, రాజధాని నిర్మాణం, ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడి అవసరం ఉందన్నారు.

GUMMANURU: రాషా్ట్రభివృద్ధి కోసం టీడీపీకి ఓటెయ్యండి: గుమ్మనూరు
29వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న జయరాం

గుంతకల్లు, మే 2: రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీకి ఓటేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని గుమ్మనూరు జయరాం ఓటర్లను కోరారు. పట్టణంలోని 29, 30 వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఓఓటర్లకు కరపత్రాలను అందజేశారు. రాషా్ట్రభివృద్ధికి, యువతకు ఉద్యోగావకాశాలకు, రాజధాని నిర్మాణం, ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడి అవసరం ఉందన్నారు. టీడీపీ నాయకులు బండారు ఆనంద్‌, బీఎస్‌ కృష్ణారెడ్డి, తలారి మస్తానప్ప, అంజి, పాల్గొన్నారు. సాయంత్రం మహేంద్ర కళ్యాణ మండపంలో చర్చి పాస్టర్లతో జయరాం సమావేశమయ్యారు. ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు.


పట్టణంలోని 25వ వార్డులో టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి సమక్షంలో 50 మంది ఏకలవ్య సంఘ సభ్యులు, 32వ వార్డులో 30 మంది రజక కుటుంబాలవారు టీడీపీలో చేరారు. గుమ్మనూరు శ్రీనివాసులు మండలంలోని దోనిముక్కల, మల్లేనిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

గుత్తి: పట్టణంలోని 14వ వార్డులో ఆలూరు మార్కెట్‌ యార్డు చైర్మన గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాంను గెలపించాలని ఓటర్లను అభ్యర్థించారు.


గుత్తిరూరల్‌: ఎన్నికల్లో గుమ్మానూరు జయరాంను గెలిపించాలని గుమ్మానూరు సోదరులు గ్రామాల్లో ప్రచారం చేశారు. గురువారం మండలంలోని పూలకుంట, బ్రహ్మణపల్లి, ఈశ్వరపల్లి గ్రామాల్లో శ్రీనివాసులు, నారాయణ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు సమ న్యాయం జరుగుతుందని, చంద్రబాబు నాయుడు సీఎం అయితే రాష్ట్రం బాగుటుందన్నారు. మండల కన్వీనర్‌ బర్దీవలి, చిన్నరెడ్డి యాదవ్‌, రామచంద్ర, సూరి, గోవర్దన గౌడ్‌, సాంబశివ, నారాయణ స్వామిప్రతాప్‌, గోవిందు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:04 AM