Share News

Tb Dam : 32 గేట్ల నుంచి నీటి విడుదల

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:17 PM

తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో మొత్తం 32 గేట్ల క్రస్ట్‌గేట్ల(20 గేట్లు రెండున్నర అడుగులు, మరో 12 గేట్లు రెండు అడుగుల మేర)ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 1,07,096 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదికి, 8952 క్యూసెక్కు లను కాలువలకు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంకు ఇనఫ్లో 1,05,378 క్యూసెక్కులుండగా ఔట్‌ఫ్లో కాలువలకు వదిలే నీటితో కలిపి 1,16,228 క్యూసెక్కులు ఉంది. డ్యాం ...

Tb Dam : 32 గేట్ల నుంచి నీటి విడుదల
Water released downstream from TB Dam

బొమ్మనహాళ్‌, జూలై 26: తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో మొత్తం 32 గేట్ల క్రస్ట్‌గేట్ల(20 గేట్లు రెండున్నర అడుగులు, మరో 12 గేట్లు రెండు అడుగుల మేర)ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 1,07,096 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదికి, 8952 క్యూసెక్కు లను కాలువలకు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంకు ఇనఫ్లో 1,05,378 క్యూసెక్కులుండగా


ఔట్‌ఫ్లో కాలువలకు వదిలే నీటితో కలిపి 1,16,228 క్యూసెక్కులు ఉంది. డ్యాం కెపాసిటీ 1633 అడుగులతో 105.788 టీఎంసీలు ఉండగా శుక్రవారం సాయంత్రానికి 1631.96 అడుగులతో 101.617 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని బోర్డు అధికారులు దిగువకు వదులుతున్నారు. హెచ్చెల్సీ ఆంధ్రా సరిహద్దు 105 కి.మీ. వద్ద 768 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 26 , 2024 | 11:17 PM