KESHAV: ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో తీర్మానించాం
ABN , Publish Date - May 08 , 2024 | 11:38 PM
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టణంలోని ఎస్సీ హాస్టల్ సమీపంలో బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకురాలు సరస్వతమ్మ అధ్యక్షత వహించారు. కేశవ్ మాట్లాడుతూ మన తలరాతలను మనమే రాసుకునే రోజు మీ చేతుల్లోనే ఉందన్నారు.
కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్
ఉరవకొండ, మే 8: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టణంలోని ఎస్సీ హాస్టల్ సమీపంలో బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకురాలు సరస్వతమ్మ అధ్యక్షత వహించారు. కేశవ్ మాట్లాడుతూ మన తలరాతలను మనమే రాసుకునే రోజు మీ చేతుల్లోనే ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మాదిగలు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారన్నారు. మనందరి లక్ష్యం నెరవేరాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ సామాజిక స్పృహకలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన తన జీవితాన్ని జాతికోసం అంకితం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణపై మాదిగలకు నరేంద్ర మోదీ మాట ఇచ్చారన్నారు. ఎన్డీఏ కూటమి గెలిస్తే రిజర్వేషన్లు అమలయ్యే అవకాశముందన్నారు. ఎంఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ మాదిగ మాట్లాడుతూ దళితులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. నాయకులు మధు, హరిగోపాల్, ఎంఎ్‌సపీ జిల్లా అధ్యక్షులు కదిరిప్ప, మహిళ అధ్యక్షురాలు స్వతంత్రకూమారి, రమేష్, చంద్ర, యలప్ప, టీడీపీ నాయకులు చంద్రశేఖర్, సుధాకర్ పాల్గొన్నారు.
ముస్లిం రిజర్వేషనపై దుష్ప్రచారం: ముస్లింల 4 శాతం రిజర్వేషనపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. పట్టణంలోని తొగట వీర కల్యాణ మండపంలో ముస్లింల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన రెడ్డి తన మీద ఉన్న కేసులకు భయపడి, బీజేపీ చేసిన చట్టాలకు వైసీపీ ఎంపీలు మద్ధతిచ్చారన్నారు. ముస్లిం 4 శాతం రిజర్వేషనను కాపాడింది చంద్రబాబేనన్నారు. బీజేపీ ఎనఆర్సీని మేనిఫెస్టోలో చేర్చలేదన్నారు. సీఏఏ, పాకిస్థాన, బంగ్లాదేశను వచ్చిన ముస్లింలకు మాత్రమే వర్తింస్తుందన్నారు. కేశవ్ మాట్లాడుతూ ముస్లింల ఆత్మగౌరవాన్ని వైసీపీ నాయకులు కించపరిచారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయన్నారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. మైనార్టీ నాయకులు రహంతుల్లా, అల్లాబకష్, బేల్దారి బాషా, రఫీ, ఖాదర్, జెండా సలాం, ఖాజా, తాజుద్దీన పాల్గొన్నారు.
టీడీపీతోనే అభివృద్ధి
బెళుగుప్ప : టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థులను గెలిపించాలని బుధవారం మండల కేంద్రంలో తెలుగు యువత నాయకులు ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో బ్యాలెట్ నమూనాపై అవగాహన కల్పిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని కోరారు. బాలాజీ, వంశీ, కృష్ణ సాయి, తేజ, వంశీ రెడ్డి, సంతోష్ పాల్గొన్నారు.