Share News

MLA KANDIKUNTA: హంద్రీనీవా నీటిని తెస్తాం

ABN , Publish Date - Sep 23 , 2024 | 11:44 PM

త్వరలో మండలానికి హంద్రీనీవా నీరు తెస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. సోమవారం మండలంలోని కురమామిడి పంచాయతీ రెక్కమాను గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

MLA KANDIKUNTA: హంద్రీనీవా నీటిని తెస్తాం
Speaking MLA Kandikunta Venkataprasad

గాండ్లపెంట, సెప్టెంబరు 23: త్వరలో మండలానికి హంద్రీనీవా నీరు తెస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. సోమవారం మండలంలోని కురమామిడి పంచాయతీ రెక్కమాను గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయనను నాయకులు పూలమాలలు వేసి స్వాగతించారు. అంగనవాడీకేంద్రంలో బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కదిరి, రాయచోటి ప్రధాన రహదారి గుంతలమయం అయిందని, నిత్యంప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణం నరకప్రాయంగా మారిందన్నారు. రహదారి మరమ్మతులను అధికారం చేపట్టిన నెలకే చేపట్టామన్నారు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.

రోడ్ల నిర్మాణానికి భూమి పూజ: మండలంలోని కొట్లపల్లి వయా పో తువాండ్లపల్లికి రూ.39 లక్షల నిధులతో చేపట్టే పనులను ఎమ్మెల్యే కందికుంట ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధేయ్యమన్నారు. తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపీడీఓ రామానాయక్‌, వి విధ శాఖల అఽధికారులు ఎంపీపీ గంగోజమ్మ, కన్వీనర్‌ కొండయ్య, ఎంపీటీసీ సోముశేఖర్‌రెడ్డి, సర్పంచ శివప్పనాయుడు, సుధాకర్‌, మాజీ సింగల్‌ విండో డైరెక్టర్‌ వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ ప్రసాద్‌, ఆనంద్‌, అక్రమ్‌, లోకేష్‌, కాకార్ల రవీంద్రారెడ్డి, జనసేన సత్యవతి పాల్గొన్నారు.


పారిశుధ్య కార్మికులు ఆరోగ్య పరిరక్షకులు

కదిరి: పారిశుధ్య కార్మికులు ఆరోగ్య పరిరక్షకులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. సోమవారం ప్రభుత్వ ఆస్పత్రిలో స్వచ్చతాహీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్యం బాగుండాలన్నారు. నెలకొక్కసారి కార్మికులు పరీక్షలు చేయించుకునేలా చూడాలని మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ను ఆదేశించారు. డాక్టర్‌ హుస్సేన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణే ధేయ్యంగా పనిచేస్తామని తెలిపారు. డాక్టర్‌ విజయలక్ష్మి, వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 11:44 PM