Share News

MLA DAGGUPATI: హామీని నిలబెట్టుకుంటాం

ABN , Publish Date - Dec 18 , 2024 | 12:05 AM

పెన్షనర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు.

MLA DAGGUPATI: హామీని నిలబెట్టుకుంటాం
MLA Daggupati Venkateswara Prasad is speaking

ఘనంగా అఖిల భారత పెన్షనర్ల దినోత్సవం

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): పెన్షనర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. లలితకళాపరిషతలో అఖిలభారత పెన్షనర్ల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దనగౌడ్‌ అధ్యక్షత జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాళంకి సుబ్బరాయన, కార్యదర్శులు పీఎ్‌సఎన మూర్తి, సతీష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పెన్షనర్ల ఉద్యమ నాయకుడు దివంగత నకారా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన వారికి సముచితమైన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా తన గెలుపులో పెన్షనర్ల పాత్రను ఎప్పటికీ మరువలేనన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు టీడీపీ ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందన్నారు. ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాళంకి సుబ్బరాయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వైసీపీ చర్యలతో విసిగిపోయి ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ ఏర్పాటు చేసి, అన్ని జిల్లాలో ఆపార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించామన్నారు. సీఎం చంద్రబాబు తమ సమస్యలపట్ల సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పెద్దనగౌడ్‌ మాట్లాడుతూ 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న అరియర్స్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. పీఆర్సీపై కమిషనను ఏర్పాటు చేసి ఐఆర్‌ను ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని విడుదల చేసి ఆదుకోవాలన్నారు. అనంతరం 75 సంవత్సరాలు నిండిన పలువురు పెన్షనర్లను సన్మానించారు. కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 1500 మందికిపైగా పెన్షనర్లు హాజరయ్యారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా సలహాదారులు డి. గోవిందరాజులు, కోశాధికారి రామకృష్ణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ప్రభాకర్‌, సంయుక్త కార్యదర్శులు ఎనఎ్‌స వరదరాజులు, దివాకర్‌, పెన్షనర్లు మహమ్మద్‌, రమే్‌షకుమార్‌, పుల్లప్ప, చంద్రశేఖర్‌రెడ్డి, అనంతయ్య, నారాయణస్వామి, నాగరాజేశ్వరీ, సావిత్రిదేవి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 12:05 AM