Share News

AMILINENI ROAD SHOW: యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

ABN , Publish Date - May 06 , 2024 | 12:16 AM

పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ఆదివారం కంబదూరు మండల పాళ్లూరు, కొత్తమిద్దెల, గొల్లపల్లి, పాత ఐపార్స్‌పల్లి, కొత్త ఐపార్స్‌పల్లి, గూళ్యం, కత్రపర్తి, కే కొత్తూరు, డీ చెన్నేపల్లిలో సురేంద్ర బాబు రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అమిలినేనికి గజమాలలతో సన్మానించి స్వాగతం పలికారు.

AMILINENI ROAD SHOW: యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
ప్రజలకు అభివాదం చేస్తున్న అమిలినేని

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని

కళ్యాణదుర్గం, మే 5: పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ఆదివారం కంబదూరు మండల పాళ్లూరు, కొత్తమిద్దెల, గొల్లపల్లి, పాత ఐపార్స్‌పల్లి, కొత్త ఐపార్స్‌పల్లి, గూళ్యం, కత్రపర్తి, కే కొత్తూరు, డీ చెన్నేపల్లిలో సురేంద్ర బాబు రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అమిలినేనికి గజమాలలతో సన్మానించి స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం రోడ్‌షోలో మాట్లాడుతూ గ్రామాల్లో చాలా మందికి ఇళ్లు, ఇంటి స్థలాలు లేవని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేయించి పక్కా గృహాలు నిర్మిస్తామన్నారు. ప్రతి గ్రామంలో సమస్యలు పేరుకుపోయాయని వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. ఏ గ్రామంలో చూసినా టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఆ ప్రజాబలంతోనే కళ్యాణదుర్గంలో అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని, ప్రతి గ్రామాంలో చంద్రబాబునాయుడి పాలనను కోరుకుంటున్నారన్నారు.


సూపర్‌సిక్స్‌ పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. ఆ పథకాలే టీడీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. వైసీపీని గద్దెదించేందుకు సిద్ధంగా వుండాలన్నారు. సొంత వైసీపీ నాయకులే పార్టీని చీదరించుకునే స్థాయికి వెళ్లిందంటే ఆ పార్టీ ఏస్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చునన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడే చంద్రబాబు నాయుడును గెలిపించే దిశగా అడుగులు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి 114 చెరువులకు సాగు, తాగునీరు ఇవ్వడమే మన ప్రధాన లక్ష్యమన్నారు. నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, ఉపాధి అవకాశాలు లేక బెంగళూరుకు వలసలు వెళుతున్నారన్నారు. వలసలను పూర్తిగా అడ్డుకట్ట వేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ఆర్థిక భద్రత, భావి తరాల భవిష్యత్తు బాగుపడాలంటే ఒక్క చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ప్రజలంతా ఘంటాపదంగా ఎలుగెత్తి చాటుతారన్నారు. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశగా మారే రోజులు దగ్గరలోనే వున్నాయన్నారు. 13వ తేదీన సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి

బ్రహ్మసముద్రం: రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడ్డాయని ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు టిపి రామన్న తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలకు దళితులకు సరైన స్వేచ్ఛ లేదని ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కూటమి అభ్యర్థులకు ప్రజలు, యువత, నిరుద్యోగులు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక: మండలంలోని మామడూరు గ్రామానికి చెందిన 10వ వార్డు మెంబర్‌ సోమరాజు అమిలినేని సురేంద్రబాబుకు మద్దతుగా మామడూరు నాయకుల ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - May 06 , 2024 | 12:16 AM