Share News

KALAVA ROADSHOW: ల్యాండ్‌ టైటిల్‌ చట్టాన్ని రద్దు చేస్తాం

ABN , Publish Date - May 04 , 2024 | 10:53 PM

రైతుల భూములను కబ్జా చేయడానికి జగన అమలు చేసేందుకు సిద్ధమైన ల్యాండ్‌ టైటిల్‌ చట్టాన్ని తెలుగుదేశం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. గొల్లపల్లి, గలగల, పైదొడ్డి, కేపీదొడ్డి, రంగసముద్రం, తాళ్లకెర, గుమ్మఘట్ట, గోనబావి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రోడ్‌షో నిర్వహించారు.

KALAVA ROADSHOW: ల్యాండ్‌ టైటిల్‌ చట్టాన్ని రద్దు చేస్తాం
రోడ్‌షోలో మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ

గుమ్మఘట్ట, మే 4: రైతుల భూములను కబ్జా చేయడానికి జగన అమలు చేసేందుకు సిద్ధమైన ల్యాండ్‌ టైటిల్‌ చట్టాన్ని తెలుగుదేశం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. గొల్లపల్లి, గలగల, పైదొడ్డి, కేపీదొడ్డి, రంగసముద్రం, తాళ్లకెర, గుమ్మఘట్ట, గోనబావి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రోడ్‌షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతూ సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల జగన పాలనలో అవినీతి, అరాచకం తప్ప ప్రజలకు ఒనగూరిందేమి లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే బీసీలకు 50 ఏళ్లకే పింఛనతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులకు రూ.4 వేలు, రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయంతో పాటు, మహిళలకు మూడు గ్యాస్‌ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, ఇంట్లో ఎంతమంది చదువుతున్న పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తారన్నారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని, చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాషా్ట్రభివృద్ధి సాధ్యమవుతుందని కాలవ శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా గొల్లపల్లి, గలగల, తాళ్లకెర గ్రామాల్లో కాలవ శ్రీనివాసులు గజమాలలతో స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి నీరాజనాలు పలికారు.


రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే..

రాయదుర్గం: రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉందని, 13వ తేదీన తేల్చుకోవాల్సి ఉంటుందని కాలవ శ్రీనివాసులు కుమార్తె కాలవ గౌతమి, కుమారుడు కాలవ భరత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉద్దేహాళ్‌, గోవిందవాడ గ్రామాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కాలవ శ్రీనివాసులు, అంబికా లక్ష్మీనారాయణలను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అలాగే రాయదుర్గం పట్టణంలోని బీటీపీరోడ్డు, బైపాస్‌ రోడ్డు వద్ద కాలవ శ్రీనివాసులు సతీమణి విజయలక్ష్మి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. కాలవ శ్రీనివాసులు అల్లుడు అనిల్‌ డీ.హీరేహాళ్‌ మండలంలోని దొడఘట్ట గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. దర్గాహోన్నూరు గ్రామంలో టీడీపీ తరపున ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు హరగోపాల్‌ ప్రచారం చేశారు.


30 కుటుంబాల చేరిక : గుమ్మఘట్ట మండలంలోని గోనబావి గ్రామంలో వైసీపీకి చెందిన 10 కుటుంబాలు శనివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. మారెప్ప, హనుమంతు, వెంకటేశులు, నాగరాజులతో పాటు మరో ఐదు కుటుంబాలు పార్టీలో చేరాయి. అలాగే తాళ్లకెర గ్రామంలో విద్యాకమిటీ చైర్మన జానమద్ది నాగరాజు, మత్స్యకారుల సంఘం సొసైటీ మాజీ అధ్యక్షుడు బెస్త లోకప్ప, గొల్ల క్యాతప్పలతో పాటు 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి కాలవ శ్రీనివాసులు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

Updated Date - May 04 , 2024 | 10:53 PM