Revenue Conference భూ సమస్యల్ని 45 రోజుల్లోగా పరిష్కరిస్తాం
ABN , Publish Date - Dec 18 , 2024 | 01:05 AM
రెవెన్యూ సదస్సుల్లో రైతులు అర్జీల ద్వారా తెలిపిన భూ సమస్యల్ని నిశితంగా పరిశీలించి 45 రోజుల్లోగా పరిష్కరిస్తామని ఆర్డీఓ వసంతబాబు తెలిపారు. మండలంలోని దుద్దేకుంట గ్రామంలో మంగళవారం రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సును నిర్వహించారు.
- దుద్దేకుంట రెవెన్యూ సదస్సులో ఆర్డీఓ వసంతబాబు
బెళుగుప్ప, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సుల్లో రైతులు అర్జీల ద్వారా తెలిపిన భూ సమస్యల్ని నిశితంగా పరిశీలించి 45 రోజుల్లోగా పరిష్కరిస్తామని ఆర్డీఓ వసంతబాబు తెలిపారు. మండలంలోని దుద్దేకుంట గ్రామంలో మంగళవారం రెవెన్యూ అధికారులు రెవెన్యూ సదస్సును నిర్వహించారు.
ఇందులో ఆర్డీఓ పాల్గొని మాట్లాడారు. మీ భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రైతులతో తెలిపారు. భూమికి సంబంధించిన ఏ సమస్యలున్నా అర్జీల ద్వారా అధికారులకు తెలపాలన్నారు. 45 రోజుల్లోగా పరిష్కారం చేస్తారని చెప్పారు. పలువురు గ్రామస్థులు శ్మశాన వాటిక సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, పరిష్కరించాలని కోరగా.. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పలువురు రైతులు తహసీల్దార్ షర్మిలకు అర్జీలు అందజేశారు. ఆర్‌ఐ రమాదేవి, వీఆర్వోలు చంద్ర, రమేష్, మధు, ప్రదీప్, సర్వేయర్ నీలకంఠ, మాజీ వైస్ ఎంపీపీ తిమ్మప్ప, సర్పంచ రత్నమ్మ టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....