Share News

TDP: తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:53 PM

మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని టీడీపీ ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని గరుగుచింతలపల్లి, చిన్నమల్లేపల్లి, కోమటికుంట్ల, పుట్లూరు, శనగలగూడూరు, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

TDP: తాగునీటి సమస్య పరిష్కరిస్తాం
రోడ్‌షోలో మాట్లాడుతున్న శ్రావణిశ్రీ, చిత్రంలో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ

పుట్లూరు, ఏప్రిల్‌ 30: మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని టీడీపీ ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని గరుగుచింతలపల్లి, చిన్నమల్లేపల్లి, కోమటికుంట్ల, పుట్లూరు, శనగలగూడూరు, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండలంలో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన దాఖలాలు లేవన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ముందుగా గండికోట నుంచి పైప్‌లైన వేసి తాగునీటి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు.


ఎస్సీ కాలనీల్లో సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరిష్కరిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, జిల్లా కార్యదర్శి సుదర్శననాయుడు, మండల కన్వీనర్‌ బాలరంగయ్య, చవ్వా కులశేఖర్‌రెడ్డి, రవిచంద్రనాయుడు, జయుడు, రాజేష్‌, నాగేశ్వరరెడ్డి, గోవర్దనరాజు, శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 30 , 2024 | 11:53 PM