Share News

Welcome to Ahuda Chairman అహుడా చైర్మనకి ఘనస్వాగతం

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:12 AM

అహుడా చైర్మనగా నియమితులైన తర్వాత విజయవాడ నుంచి మొదటి సారిగా అనంతపురానికి వెళ్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌కు గుత్తిమండలం కరిడికొండ గ్రామశివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం కుటమి నాయకులు ఘనస్వాగతం పలికారు.

Welcome to Ahuda Chairman అహుడా చైర్మనకి ఘనస్వాగతం
పామిడిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న టీసీ వరుణ్‌

గుత్తి రూరల్‌/పామిడి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి) : అహుడా చైర్మనగా నియమితులైన తర్వాత విజయవాడ నుంచి మొదటి సారిగా అనంతపురానికి వెళ్తున్న జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌కు గుత్తిమండలం కరిడికొండ గ్రామశివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం కుటమి నాయకులు ఘనస్వాగతం పలికారు.


నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఎదురేగి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనతరం టీసీ వరుణ్‌ బాట సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ, మండల, పట్టణ కన్వీనర్లు బర్ధీ వలి, ఎంకే చౌదరి తదితరులు పాల్గొన్నారు. అలాగే టీసీ వరుణ్‌కు పామిడిలో జనసేన మండల అధ్యక్షుడు ధనుంజయ జనసైనికులతో కలిసి ఘన స్వాగతం పలికారు. గజమాల వేసి సత్కరించారు. ఎద్దులపల్లి సర్కిల్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి టీసీ వరుణ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అంజినాయక్‌, మహిళా నాయకురాలు లక్ష్మీదేవి, జనసేన మండల ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Nov 15 , 2024 | 01:12 AM