Share News

PD VISIT: నేమ్‌ బోర్డులు ఏవీ?

ABN , Publish Date - Jul 04 , 2024 | 11:41 PM

మండలంలో ఉపాధి పనులు చేసిన చోట్ట నేమ్‌ బోర్డులు ఎందుకు పెట్టలేదని వాటర్‌షెడ్‌ ఏపీడీ సుధాకర్‌రెడ్డి.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శింగనమల మండలంలో 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో రూ.8 కోట్ల పనులపై సామాజిక తనిఖీల తరువాత గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రజావేదిక ఓపెన ఫోరం నిర్వహించారు.

PD VISIT: నేమ్‌ బోర్డులు ఏవీ?
Officials talking in public conference

శింగనమల, జూలై 4: మండలంలో ఉపాధి పనులు చేసిన చోట్ట నేమ్‌ బోర్డులు ఎందుకు పెట్టలేదని వాటర్‌షెడ్‌ ఏపీడీ సుధాకర్‌రెడ్డి.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శింగనమల మండలంలో 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో రూ.8 కోట్ల పనులపై సామాజిక తనిఖీల తరువాత గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రజావేదిక ఓపెన ఫోరం నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్‌ పీడీతో పాటు విజిలెన్స అధికారి రమణారెడ్డి, ఎంపీడీఓ వెంకటరమణ, ఎంపీపీ యోగేశ్వరి హాజరయ్యారు. సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ పనులు చేసిన తరువాత ఎక్కడ వర్క్‌ ఐడీ పనులకు ఎంత ఖర్చు పెట్టారని ఎక్కడా నేమ్‌ బోర్డులు లేవని మండిపడ్డారు. ఎక్కడా మస్టర్లు, ఎంబుక్‌లు చేయలేదన్నారు. మండలంలో రూ.8 కోట్ల పనులు జరిగితే సామాజిక తనిఖీలో కేవలం రూ.లక్షల్లో అనీఈతి జరిగిందని, రికవరీకి అధికారులు ఆదేశించడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఈసీ దామోదర్‌, ఎనఆర్‌పీ వలి పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2024 | 11:41 PM