TDP: ప్రజలకు అండగా ఉంటా: అశ్మితరెడ్డి
ABN , Publish Date - May 03 , 2024 | 12:10 AM
ప్రజలకు అండగా ఉంటా... అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని, ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కూటమి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పుప్పాల, నగరూరు, వేములపాడు, చందన, రాయలచెరువు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.
యాడికి, మే2: ప్రజలకు అండగా ఉంటా... అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని, ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కూటమి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పుప్పాల, నగరూరు, వేములపాడు, చందన, రాయలచెరువు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైకో పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ పడకేసిందని తెలిపారు. కొన్ని గ్రామాల్లో ప్రజలకు కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకడం లేదన్నారు. గ్రామ పంచాయతీల నిధులను ప్రభుత్వం దోచేయడంతో వీధిలైట్లు కూడా వెలగని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరాడు. రోడ్‌షో సందర్భంగా జేసీ అశ్మితరెడ్డి ప్రసంగాన్ని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విన్నారు. ఆయన వెంట జనసేన నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, రంగనాథ్‌రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వా గోపాల్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడు, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, నాయకులు పరిమి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
జగన అధికారంలోకి వస్తే మీ భూములన్నీ గోవిందా: ఈసారి జగన మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములన్ని గోవిందా... గోవిందానే అని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. గురువారం అశ్మితరెడ్డి రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పేరుతో జగన ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువస్తోందన్నారు. ఈసారి మళ్లీ జగన వస్తే మీ భూములు అన్ని గోవిందా అని తెలిపారు.
విరాజ్‌రెడ్డి ప్రచారం
తాడిపత్రిటౌన: పట్టణంలోని ఆసుపత్రిపాలెంలో గురువారం మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కుమారుడు విరాజ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను అందించి వాటిలోని అంశాలను ప్రజలకు వివరించారు. కౌన్సిలర్లు రేష్మాపర్వీన, విజ్జి, టీడీపీ నాయకులు అనిఫ్, నాగరంగయ్య, శేఖర్ పాల్గొన్నారు.
అభివృద్ధికి కేరాఫ్ టీడీపీ: అభివృద్ధికి కేరాఫ్ టీడీపీ అని జేసీ పవనరెడ్డి అన్నారు. పట్టణంలోని 4వ వార్డులోని పలు ప్రాంతాలు, బుడగజంగాల కాలనీల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్ జింకా లక్ష్మిదేవి, వేలూరు రాజశేఖర్‌నాయుడు, ఖాదర్‌బాషా, వేణు, సుదర్శనబాబు పాల్గొన్నారు.