MLA Gummanur ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే గుమ్మనూరు
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:47 AM
పట్ణణంలోని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఆయన ఆస్పత్రి అభివృద్ది సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు పాటుపడుతామన్నారు.
గుత్తి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): పట్ణణంలోని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఆయన ఆస్పత్రి అభివృద్ది సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు పాటుపడుతామన్నారు.
ఈ ఆసుపత్రికి చుట్టూ జాతీయ రహదారులతో పాటు ప్రధాన రైల్వే జంక్షన ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను అధికంగా ఇక్కడికే తీసుకొస్తారన్నారు. కనుక వారికి ఎమెర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ట్రామా సెంటర్ తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. 50 పడకల నుంచి 100 పడకలు ఆస్పత్రిగా అభివృద్ది పరుస్తామన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటైన ఆస్పత్రి అభివృద్ధి సలహా మండలిని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప ప్రకటించారు. చైర్మనగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కన్వీనర్‌గా వైద్యుడు ఎల్లప్ప, సభ్యులుగా మున్సిపల్ కమిషనర్ జబ్బార్‌మియా, ఎంపీడీఓ ప్రభాకర్, మహిళా సమైఖ్య కార్యదర్శి హేమలత, శ్రీనివాసులు, రమేష్, విశ్రాంత వైద్యుడు క్రిష్ణగోపాల్ రెడ్డిని ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే బాలింతలకు, గర్భిణులకు పౌష్టిక ఆహారం అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు ఈశ్వర్, సోదరుడు నారాయణ, టీడీపీ నాయకులు ఎంకే చౌదరి, బర్దివలి, సోమశేఖర్, దిల్‌కా శీనా తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..