AP News: ప్రేమను వ్యతిరేకించిన తల్లిదండ్రులపై ఆ కూతురు చేసిన పనికి...
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:29 PM
Andhrapradesh: తాడిపత్రిలోని ఐశ్వర్య విలాస్‌లో నివసిస్తున్న శ్రీనివాసులు కుమార్తె శ్రీజ.. ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీజను తల్లిదండ్రులు మందలించారు. దీంతో కోపంతో కూతురు శ్రీజ చేసిన పని తల్లి ప్రాణాలమీదకు తీసుకొచ్చింది.
అనంతపురం, డిసెంబర్ 3: సాధారణంగా యువతీయువకులు ప్రేమించుకుంటే పెద్దలు అందుకు అంగీకరించని సందర్భాలు ఎన్నో చూశాం. కొంతమంది పెద్దల అంగీకారంతో పెళ్లిళ్లు చేసుకుంటే.. మరికొందరు తల్లిదండ్రులకు చెప్పకుండా తమ ప్రేమను గెలిపించుకునేందుకు వాళ్లదారి వారు చూసుకుంటారు. ఇంట్లో చెప్పుకుండా వెళ్లిపోయి వివాహాలు చేసుకుంటారు. అయితే తమ కుమారుడు, కుమార్తె ప్రేమ విషయం తెలిసి పెద్దలు పరువుపోతుందని భావిస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయి విషయంలో తల్లిదండ్రుల ప్రవర్తన వేరేగా ఉంటుంది.
Raghurama Case: డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్.. ఇంప్లీడ్ పిటిషన్ వేసిన రఘురామ
తమ అమ్మాయి ప్రేమించిందన్న విషయం తెలిసిందంటే పేరెంట్స్ తీవ్రంగా మందలిస్తుంటారు. తమ బిడ్డకు అనేక విధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒకానొక సమయంలో తీవ్రంగా మందలిస్తారు కూడా. తాడిపత్రిలోనూ ఓ తల్లి ఇలానే చేసింది. కుమార్తె ప్రేమ విషయం తెలిసి మందలించింది. అయితే ఆ తరువాత కుమార్తె చేసిన పనికి తల్లి ప్రాణాలనే కోల్పోయింది. ఇంతకీ కూతురు ఏం చేసింది. ఎందుకు తల్లి బలన్మరణానికి పాల్పడిందో ఇప్పుడు చూద్దాం.
తాడిపత్రిలో (Tadipatri) ఓ కూతురి ప్రేమ తల్లి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. పట్టణంలోని ఐశ్వర్య విలాస్‌లో నివసిస్తున్న శ్రీలక్ష్మీ తనను పోలీసులు మందలించేలా కూతురు చేసిందనే కారణంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తాడిపత్రిలోని నవరంగ్ టాకీస్ రోడ్‌లో శ్రీనివాసులు కిరాణా కొట్టు నిర్వహిస్తున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది. అయితే సమీపంలోనే ఓ దుకాణంలో పనిచేస్తున్న యువకుడిని శ్రీనివాసులు కూతురు శ్రీజ ప్రేమించింది. ఎప్పటిలాగే ప్రతీ తల్లిదండ్రుల చేసిన విధంగానే.. కూతురు ప్రేమ వ్యవహారం తెలిసి శ్రీజ తల్లిదండ్రులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.
హైదరాబాద్‌లో మరో ఎలివేటర్ కారిడార్.. ఎక్కడంటే
తన ప్రేమను నిరాకరించారన్న కోపంతో శ్రీజ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. తల్లిదండ్రులపై డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీజ ఫిర్యాదుపై ఇంటికి వెళ్లిన పోలీసులు.. తల్లీ కూతురుతో మాట్లాడారు. అయితే ఇంటికి పోలీసులు రావడంపై శ్రీనివాసులు భార్య శ్రీ లక్ష్మీ అంత ఈజీగా తీసుకోలేకపోయింది. కన్న కూతురే పోలీసులకు ఫిర్యాదు చేయడంపై తీవ్ర మనస్థాపానికి గురైంది. వెంటనే పురుగుల మందు తాగి శ్రీలక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన బంధువులు శ్రీనివాసులు ఇంటికి వచ్చారు. అయితే శ్రీలక్ష్మీ ఆత్మహత్యకు కారణం కూతురే అంటూ యువతిని బంధువులు మందలించారు. బంధువుల సూటిపోటి మాటలతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీజ ఇంటిపైకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన బంధువులు శ్రీజను కిందకు దించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే శ్రీజ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో శ్రీజకు చికిత్స కొనసాగుతోంది. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
మాజీ ఎమ్మె ల్యే ద్వారంపూడికి మరో షాక్
రామంతాపూర్‌లో నకిలీ వైద్యుల గుట్టు రట్టు
Read Latest AP News And Telugu News