Share News

GUMMANURU : తలరాతలు మార్చేది మహిళలే: గుమ్మనూరు

ABN , Publish Date - May 09 , 2024 | 11:42 PM

పార్టీల తలరాతలు మార్చే శక్తి మహిళలకు ఉందని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి మహిళలే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం సాయంత్రం ఆయన పట్టణంలో రోడ్‌ షో నిర్వహించారు. పాతగుంతకల్లు నుంచి వ్యాపార సముదాయాల వారికి, పట్టణ ప్రజలకు అభివాదాలు తెలుపుతూ ప్రధాన రహదారిలో ప్రచారం చేశారు.

GUMMANURU : తలరాతలు మార్చేది మహిళలే: గుమ్మనూరు
గుంతకల్లులో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మాట్లాడుతున్న జయరాం

గుంతకల్లు, మే 9: పార్టీల తలరాతలు మార్చే శక్తి మహిళలకు ఉందని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి మహిళలే తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం సాయంత్రం ఆయన పట్టణంలో రోడ్‌ షో నిర్వహించారు. పాతగుంతకల్లు నుంచి వ్యాపార సముదాయాల వారికి, పట్టణ ప్రజలకు అభివాదాలు తెలుపుతూ ప్రధాన రహదారిలో ప్రచారం చేశారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ప్రజలను ఉద్దేశించి జయరాం మాట్లాడారు. గుంతకల్లు టీడీపీ టిక్కెట్‌ తనకు లభించినందుకు వైసీపీ శిబిరంలో ఆందోళన మొదలైందని, పోలింగ్‌ సమీపించే కొద్దీ వారి ఓటమి వారికి కనిపిస్తోందని అన్నారు. స్వయానా దౌర్జన్యం చేస్తూ తనపై దౌర్జన్యపరుడన్న ముద్రవేయడానికి ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి శతవిధాలా యత్నించాడన్నారు.


ఆలూరులో 2014లో 2 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన తనను 2019లో దాదాపు 40 వేల మెజారిటీ లభించిందని, తాను దౌర్జన్యపరుడనైతే అక్కడి ప్రజలు ఆదరించి ఉండేవారు కాదన్నారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్‌, నాయకులు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి, పత్తి హిమబిందు, ప్రతాప్‌నాయుడు, తలారి మస్తానప్ప, తలారి సరోజమ్మ, డన్లప్‌ బాషా, అహ్మద్‌ బాషా, ఉడదాల ప్రభాకర్‌, ఫ్రూట్‌ మస్తాన, షర్ఫుద్దీన, ఫక్రుద్దీన, యాస్మిన, జనసేన జిల్లా నాయకుడు వాసగిరి మణికంఠ పాల్గొన్నారు. గుమ్మనూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాతగుంతకల్లులోని బెస్త సంఘ సభ్యులకు పార్టీ కండువాలను వేసి టీడీపీలోకి ఆహ్వానించారు.


గుత్తిరూరల్‌: చంద్రబాబు నాయుడుతోనే గ్రామాల అబివృద్ధి సాధ్యమని గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ పేర్కొన్నారు. గురువారం మండలంలోని గొందిపల్లి, చేర్లోపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. జయరాంను గెలిపించాలనివారు ఓటర్లను అభ్యర్థించారు. నాయకులు బర్దివలి, వెంకట నారాయణ, లక్ష్మీనారాయణమ్మ, రంగారెడ్డి యాదవ్‌, శివశంకర్‌, నారాయణస్వామి, కిట్ట, హనుమంతురెడ్డి, ఆదినారాయణరెడ్డి, హరి పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 11:43 PM