Share News

Women should grow with their own strength మహిళలు స్వశక్తితో ఎదగాలి: జేసీపీఆర్‌

ABN , Publish Date - Nov 06 , 2024 | 01:16 AM

మహిళలు స్వశక్తితో ఎదగాలని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన మహిళా సంఘాలు, డిజైనింగ్‌, మ్యాచింగ్‌సెంటర్‌, బ్యూటీపార్లర్‌, సిల్క్‌హౌస్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

 Women should grow with their own strength మహిళలు స్వశక్తితో ఎదగాలి: జేసీపీఆర్‌
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి

తాడిపత్రి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహిళలు స్వశక్తితో ఎదగాలని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన మహిళా సంఘాలు, డిజైనింగ్‌, మ్యాచింగ్‌సెంటర్‌, బ్యూటీపార్లర్‌, సిల్క్‌హౌస్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.


మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమిలేదన్నారు. వారిలో పట్టుదల, కృషి ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఏమైనా చిరువ్యాపారాలు గానీ, మీకు సంబంధించిన వ్యాపారాలు గానీ చేస్తామని చెబితే ఎప్పుడు అండగా తాను ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే బ్యాంకర్లతో సమావేశమై స్వయం ఉపాధికి సంబంధించి రుణాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ శివరామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Nov 06 , 2024 | 01:16 AM