Share News

Collector : కమిట్‌మెంట్‌తో పని చేయండి

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:28 PM

వైద్యులు, సిబ్బంది కమిట్‌మెంట్‌తో పని చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ సూచించారు. జిల్లా ఆస్పత్రిలో మంగళవారం తలసీమియాపై నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ డాక్టర్‌ వృత్తికి సమాజంలో చాలా గౌరవం ఉంటుందని, మనం ప్రజలకు మంచిగా సేవలందించినపుడు అది మరింత పెరుగుతుందన్నారు. రోగులతో మర్యాదగా, ప్రేమగా మెలగాలని డాక్టర్లకు సూచించారు. తాను డాక్టర్‌గా పని చేసిన మారుమూలప్రాంతంలో ఎదురైన ఇబ్బందులు, ప్రజలు గౌరవించిన తీరును తెలిపారు. ఇప్పటికీ చాలా మంది వైద్యం కోసం ఆర్‌ఎంపీల వద్దకు వెళుతున్నారంటే పేషంట్‌ రాగానే ఆప్యాయంగా పలకరించి వైద్యం

Collector : కమిట్‌మెంట్‌తో పని చేయండి
Collector addressing the doctors

- రోగులను ప్రేమగా పలకరించండి

- డాక్టర్లకు కలెక్టరు వినోద్‌ కుమార్‌ సూచన

అనంతపురం టౌన, జూలై 23: వైద్యులు, సిబ్బంది కమిట్‌మెంట్‌తో పని చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ సూచించారు. జిల్లా ఆస్పత్రిలో మంగళవారం తలసీమియాపై నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ డాక్టర్‌ వృత్తికి సమాజంలో చాలా గౌరవం ఉంటుందని, మనం ప్రజలకు మంచిగా సేవలందించినపుడు అది మరింత పెరుగుతుందన్నారు. రోగులతో మర్యాదగా, ప్రేమగా మెలగాలని డాక్టర్లకు సూచించారు. తాను డాక్టర్‌గా పని చేసిన మారుమూలప్రాంతంలో ఎదురైన ఇబ్బందులు, ప్రజలు గౌరవించిన తీరును తెలిపారు. ఇప్పటికీ చాలా మంది వైద్యం కోసం ఆర్‌ఎంపీల వద్దకు వెళుతున్నారంటే పేషంట్‌ రాగానే ఆప్యాయంగా పలకరించి వైద్యం అందించడమే కారణమన్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్‌ఎంపీలు వచ్చీ రాని వైద్యంతో స్టెరాయిడ్స్‌ ఇచ్చి రోగులను మరింత అనారోగ్యాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ వైద్యులు కూడా సకాలంలో డ్యూటీకి వచ్చి రోగులతో ప్రేమగా మెలుగుతూ వైద్య సేవలందిస్తే నమ్మకం, గౌరవం పెరుగుతాయని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో పని చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు సరిగా చూడరని ఉన్న చెడ్డపేరును తొలగించుకోవాలని కలెక్టరు హితబోధ చేశారు. ఆస్పత్రి అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందన్నారు. చిన్నపిల్లలు, గైనిక్‌, ట్రామాసెంటర్‌, ఐసీయూ విభాగాలలో అవసరమైన పడకలు, సౌకర్యాల


ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

తలసేమియా చికిత్సకు సంకల్ప ఫౌండేషనతో ఎంఓయూ

పుట్టుకతోనే తలసేమియా వ్యాధితో అనేకమంది బాధపడుతున్నారు. వారికి అవసరమైన వైద్యం, రక్తం అందించాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలాంటి వారి కోసం సంకల్ప ఫౌండేషన ఇప్పటికే ఆర్డీటీ ఆస్పత్రిలో వైద్యసేవలను అందిస్తోంది. ఈనేపథ్యంలో జిల్లా సర్వజన ఆస్పత్రిలోను తలసీమియా బాధితులకు తగిన వైద్యసేవలు అందించడం కోసం సంకల్ప ఫౌండేషనతో ఒప్పందం చేసుకోవాలని డీఎంఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో మంగళవారం కలెక్టరు సమక్షంలో సంకల్ప ఫౌండేషన సీఈఓ రాకేష్‌ ఆస్పత్రిలో సేవలు అందించడం కోసం ఎంఓయూ చేసుకున్నారు. కార్యక్రమంలో వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాణిక్యాలరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓలు డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ హేమలత, గైనిక్‌, చిన్నపిల్లల విభాగాల హెచఓడీలు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

బాల్యవివాహాలను అడ్డుకోండి

జిల్లాలో ఎక్కడా బాల్యవివాహాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టరు వినోద్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బాల్యవివాహాల నిర్మూలనపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఏఏప్రాంతంలో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నాయో ఆప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బాల్యవివాహాలు చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా నాశనం అవుతుంది? వారు పడే కష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే బాల్య వివాహాలు చేస్తే చట్టప్రకారం ఎలా శిక్షార్హులవుతారో వివరించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్నిశాఖలు ఈబాల్యవివాహాల నిర్మూలన లో సమష్టిగా, సమన్వయంతో సాగాలని ఆదేశించారు. ప్రధానంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయని అందుకే ఆయా ప్రాంతాల్లో విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, డీఆర్‌డీఏ పీడీ ఓబులమ్మ, డీఎంహెచఓ డాక్టర్‌ ఈ.బీ.దేవి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 23 , 2024 | 11:28 PM