KAKKALAPALLI ROAD: వామ్మో.. కక్కలపల్లి రోడ్డా..!
ABN , Publish Date - Aug 18 , 2024 | 12:11 AM
మండలంలోని కక్కలపల్లికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయమైపోయింది. దీంతో ఆ రోడ్డు గుండా ప్రయాణం సాగించే ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
అనంతపురం రూరల్, ఆగస్టు 17: మండలంలోని కక్కలపల్లికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయమైపోయింది. దీంతో ఆ రోడ్డు గుండా ప్రయాణం సాగించే ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కక్కలపల్లి క్రాస్ మొదట్లో రోడ్డంతా గుంతలమైపోయింది. టమోటా మార్కెట్ నుంచి కొంత సీసీ రోడ్డు వేయడంతో కాస్త బాగానే ఉన్నా.. ఆ తరువాత రోడ్డు అంతా అధ్వానంగా ఉంది. రోడ్డులో పెద్దగుంతలు కనిపిస్తున్నాయి. దీనికితోడు శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమైపోయింది. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మట్టిరోడ్డు వేశారు. ఇది మంచిదే అయినా..మార్కెట్‌కు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. ఈక్రమంలో రోడ్డులో మళ్లీ గుంతలు పడ్డాయి. ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు రోడ్డు వేస్తే ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మార్కెట్‌కు టోల్ వసూలు చేస్తే..: టమోటా మార్కెట్ ద్వారా పంచాయతీకి సుంకం వసూళ్లు నేపథ్యంలో ఆదాయం సమకూరేది. టోల్ వసూలుకు వేలం వేయడం ద్వారా రూ.అరకోటి వరకు పంచాయతీకి ఆదాయం వచ్చేది. గత ఏడాది నుంచి టోల్ వసూలు వేలం బంద్ చేసేశారు. వాహనాలనుంచి టోల్ వసూలు చేయకూడదని సంబంధిత అసోసియేషన సభ్యులు కోర్టు ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో పంచాయతీ అధికారులు టోల్ వసూలు వేలం నిలిపివేశారు. కనీసం ఆ నిధులైన ఉంటే ప్రధాన రోడ్డు వేసుకునేందుకు వీలుండేదీ.