Share News

GUMMANURU: వైసీపీ పనైపోయింది: జయరాం

ABN , Publish Date - May 08 , 2024 | 11:46 PM

ఎన్నికల్లో వైసీపీ పని అయిపోయిందని, మరో వారంలో ప్యాకప్‌ తప్పదని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకులు జయరాం సమక్షంలో టీడీపీలో చేరారు.

GUMMANURU: వైసీపీ పనైపోయింది: జయరాం
గుమ్మనూరు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

గుంతకల్లు, మే 8: ఎన్నికల్లో వైసీపీ పని అయిపోయిందని, మరో వారంలో ప్యాకప్‌ తప్పదని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పలువురు వైసీపీ కార్యకర్తలు, నాయకులు జయరాం సమక్షంలో టీడీపీలో చేరారు. దోనిముక్కల మాజీ సర్పంచు తలారి దేవేంద్ర, నల్లదాసరిపల్లి ఉపసర్పంచు బైపల్లి నాగేంద్ర, నెలగొండ నాయకుడు శ్యాంబాబు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గుమ్మనూరు నారాయణ స్వామి, పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్‌, తలారి మస్తానప్ప పాల్గొన్నారు. గుమ్మనూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని 14, 18వార్డుల్లోనూ, తిమ్మాపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో గుమ్మనూరు వెంకటేశులు, కేసీ రామాంజనేయులు, మత్రునాయక్‌, చంద్ర, ప్రకాశ రెడ్డి, శివ, సతీశ పాల్గొన్నారు.


గుత్తి: తనకు ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గుమ్మనూరు జయరాం ఓటర్లను అభ్యర్థించారు. గుత్తి మండలంలోని వన్నేదొడ్డి, కరిడికొండ గ్రామాల్లో రాత్రిదాకా ఆయన ప్రచారం చేశారు. రాత్రి 9 గంటలకు గుత్తి పట్టణంలో ఏర్పాటుచేసిన రజక, బలిజ సంఘ సభ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని తనకు ఎన్నికల్లో మద్దతివ్వాలని అభ్యర్థించారు. టీడీపీ నాయకుడు కేసీ హరి, జనసేన జిల్లా కార్యదర్శి మణికంఠ, బీజేపీ నాయకులు బండి సత్య, కప్పటాల సురేష్‌, చిరంజీవి పాల్గొన్నారు. అలాగే గుత్తి రైల్వే డీజిల్‌ షెడ్‌లో జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన రైల్వే కార్మికులు, ఉద్యోగులను జయరాంను గెలపించాలని అభ్యర్థించారు. అదే విధంగా గుత్తి ఆర్‌ఎ్‌సలోని 3వ వార్డులో భారీ ఎత్తున ప్రచారం చేపట్టారు. ఎంగన్నపల్లి సర్పంచు భరత, న్యాయవాది సోమశేఖర్‌, టౌనబ్యాంక్‌ ఽఅధ్యక్షుడు అబ్దుల్‌జిలాన, వీరన్న, కొనకొండ్లసూరి, అబ్దుల్‌వహబ్‌, రాము, వెంకటేష్‌, శ్రీకాంతచౌదరి, ఎంకే చౌదరి, చిరంజీవి పాల్గొన్నారు.


పామిడి: పట్టణంలోని 9వ వార్డుకు చెందిన 200 కుటుంబాలతో కలిసి వైసీపీ నాయకుడు శ్రీనివాసులు బుధవారం టీడీపీ గూటికి చేరారు. పట్టణంలోని పామిడమ్మ దేవాలయం నుంచి టీడీపీ కార్యాలయం వరకూ ర్యాలీగా వచ్చి గుమ్మనూరు ఈశ్వర్‌ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసరెడ్డి, గుత్తి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన ప్రభాకర్‌చౌదరి, మున్సిపల్‌ మాజీ చైర్మన గౌస్‌పీరా, మాజీ ఎంపీటీసీ జింకల సంజీవకుమార్‌, రమేష్‌, తలారి నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 11:46 PM