Share News

MINISTER KESHAV: హంద్రీనీవాను పట్టించుకోని వైసీపీ

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:45 PM

వైసీపీ పాలనలో హంద్రీనీవా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. మండలంలోని కోనాపురం వద్దనున్న 11వ పంపుహౌ్‌సను సోమవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ విద్యుత సబ్‌స్టేషను నిర్మాణానికి రూ.2.71 కోట్లు విడుదల చేశామన్నారు.

MINISTER KESHAV: హంద్రీనీవాను పట్టించుకోని వైసీపీ
Minister Payyavula Keshav reviewing with officials

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

బెళుగుప్ప, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) వైసీపీ పాలనలో హంద్రీనీవా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. మండలంలోని కోనాపురం వద్దనున్న 11వ పంపుహౌ్‌సను సోమవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ విద్యుత సబ్‌స్టేషను నిర్మాణానికి రూ.2.71 కోట్లు విడుదల చేశామన్నారు. అనంతరం ట్రాన్సకో, హెచఎనఎ్‌సఎ్‌స, రెవెన్యూ అధికారులతో హంద్రీనీవా వేగవంతానికి చర్యలు తీసుకోవడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయికు వెళ్లి కల్వర్టుల నిర్మాణం, భూసేకరణ తదితర వివరాలను అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా కాలువలపై కల్వర్టులను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హంద్రీనీవా గురించి అయిదేళ్లలో వైసీపీ పట్టించుకోలేదన్నారు. మండలంలో ప్రతి చెరువుకు హంద్రీనీవా నీరందించడమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ షర్మిల, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, హెచఎనఎ్‌సఎ్‌స సీఈ నాగరాజు, ఈఈ శ్రీనివాసనాయక్‌, డీఈలు రమణ, చంద్ర శేఖర్‌, ఇంజనీర్లు సుదర్శన, సర్పరాజ్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఉపాధి పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలి

ఉపాధి హామీ పథకాన్ని ఉద్యాన రైతులకు అనుసంధానం చేసి ఆదుకోవాలని జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సభ్యులు సర్పంచ రాము, టీడీపీ నాయకులు ఎలగలవంక సురే్‌షలు మంత్రి పయ్యావుల కేశవ్‌కు వినతిపత్రం అందించారు. పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.

Updated Date - Dec 02 , 2024 | 11:45 PM