MRPS: అంబేడ్కర్‌ను అవమానించిన వైసీపీ
ABN , Publish Date - Dec 14 , 2024 | 12:27 AM
అంబేడ్కర్‌ను అవమానించిన వైసీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న ఆంజనేయులు డిమాండ్ చేశారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న ఆంజనేయులు
అనంతపురం సెంట్రల్, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ను అవమానించిన వైసీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న ఆంజనేయులు డిమాండ్ చేశారు. రైతుపోరు పేరుతో వైసీపీ కలెక్టరేట్‌కు ర్యాలీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించింది. ర్యాలీలో భాగంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంట్రామిరెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి జడ్పీవద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కాళ్లకు చెప్పులతోనే మెట్లెక్కి వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి ఎలా నివాళులర్పిస్తారని ఆంజనేయులు ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాతను వైసీపీ నాయకులు అవమానించారని ఆందోళనకు దిగారు. గమనించిన పోలీసులు ఆయన్ను అడ్డుకుని అక్కడినుంచి తరలించారు. ఈ సందర్భంగా చిన్న ఆంజనేయులు మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగనమోహనరెడ్డికి అంబేడ్కర్‌పై గౌరవం లేదన్నారు. ఆయన బాటలోనే ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.