Share News

Governing Council : వర్సిటీల్లో ఇంకా వైసీపీ పాలనే

ABN , Publish Date - Aug 04 , 2024 | 12:22 AM

ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. నిర్వహణ కోసం పాలక మండలిని (ఈసీ) ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి పనులు, కోర్సులలో ప్రవేశాలు, భవన నిర్మాణాలు, సిబ్బంది నియామకం, ప్రమోషన్లు.. ఇలా అన్నింటిపై ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈసీలో సభ్యులుగా చేరేందుకు చాలామంది పోటీ పడతారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తమకు నచ్చిన వారిని సభ్యులుగా చేర్పించి, ఆర్థిక ప్రయోజనాలు పొందారని వర్సిటీల వర్గాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా పాత ఈసీలే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మారినందున.. ఈసీని కూడా మార్చాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ...

Governing Council : వర్సిటీల్లో ఇంకా వైసీపీ పాలనే
The entrance to SKU

పాలక మండళ్లను మార్చని ప్రభుత్వం

గత ప్రభుత్వంలో అడ్డగోలు నిర్ణయాలు

ఎస్కేయూ, జేఎనటీయూలో అక్రమాలు

ఈసీలను మార్చాలని వర్సిటీ వర్గాల డిమాండ్‌

ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. నిర్వహణ కోసం పాలక మండలిని (ఈసీ) ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి పనులు, కోర్సులలో ప్రవేశాలు, భవన నిర్మాణాలు, సిబ్బంది నియామకం, ప్రమోషన్లు.. ఇలా అన్నింటిపై ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈసీలో సభ్యులుగా చేరేందుకు చాలామంది పోటీ పడతారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు తమకు నచ్చిన వారిని సభ్యులుగా చేర్పించి, ఆర్థిక ప్రయోజనాలు పొందారని వర్సిటీల వర్గాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనా పాత ఈసీలే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మారినందున.. ఈసీని కూడా మార్చాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

- అనంతపురం సెంట్రల్‌

కోటాల వారీగా నియామకం

పాలక మండలి సభ్యులుగా ప్రభుత్వ శాఖల అధికారు లు, సమాజంలో వివిధ రంగాల ప్రముఖులను నియమిస్తారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, టెక్నికల్‌ ఎడ్యుకేషన డైరెక్టర్‌, ఆర్థికశాఖ డిప్యూటీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌, కాలేజియేట్‌ ఎడ్యుకేషన కమిషనర్‌, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన ప్రభుత్వ కోటా లో సభ్యులుగా ఉంటారు. వర్సిటీ వీసీ చైర్మనగా, రిజిస్ర్టార్‌ సెక్రెటరీగా, రెక్టార్‌ అంతర్గత సభ్యుడిగా ఉంటారు. వీరితోపాటు కోటాల వారీగా.. వర్సిటీ సొంత కళాశాలల నుంచి ప్రిన్సిపాల్‌, సీనియర్‌, జూనియర్‌ అఽధ్యాపకులు, అనుబంధ ప్రైవేట్‌ కళాశాలల నుంచి ప్రిన్సిపాల్‌, లెక్చరర్‌, కళాశాల యాజమాని ఒకరు చొప్పున సభ్యులుగా నియమిస్తారు.


పారిశ్రామికవేత్తలు, చార్టెడ్‌ అకౌంటెంట్‌, సోషల్‌ యాక్టివిస్ట్‌, అడ్వకేట్‌, డాక్టర్‌, ఇంటలెక్చువల్‌ కోటా నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పిస్తారు. జేఎనటీయూ ఈసీలో చైర్మెనగా వీసీ, సెక్రటరీగా రిజిసా్ట్రర్‌తోపాటు 12 మంది సభ్యులు ఉన్నారు. ఎస్కేయూ ఈసీలో చైర్మనగా వీసీ, సెక్రటరీగా రిజిసా్ట్రర్‌తో పాటు 13 మంది సభ్యులు ఉన్నారు.

ఈసీ నిర్ణయమే శిరోధార్యం

పాలక మండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలే వర్సిటీలకు శిరోధార్యం. గత మూడేళ్లలో ఎస్కేయూలో అనేక అక్రమాలను పాలకమండలి సమావేశాల్లో అజెండాలుగా చేర్చారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి పాలకమండలి తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌, కోర్టులకెళ్లినా పాలక మండలి నిర్ణయాలకు ఎదురు చెప్పదని అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పారని వర్సిటీ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో అనేకమంది ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు ఎదుర్కొన్నారని, విద్యార్థులకు అన్యాయం జరిగిందని మండిపడుతున్నాయి. తామేమి తక్కువ కాదన్నట్లు జేఎనటీయూ పాలక మండలి కూడా ఇష్టానుసారంగా వ్యవహరించింది. వర్సిటీ నిధులను మంచినీళ్లప్రాయంగా ఖర్చుచేసిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి.

సమాచార లీకులు

వర్సిటీల్లో అంతర్గంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పను లు తదితర అంశాలను ఈసీ సమావేశంలో చర్చించాల్సి ఉంటుంది. దీనికోసం గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు సిఫార్సులతో జేఎనటీయూ, ఎస్కేయూ ఈసీ మెంబర్లుగా కొంతమందిని నియమించుకున్నారు. వీరి ద్వారా అంతర్గత సమాచారాన్ని తీసుకుని ఆర్థిక, ఇతర ప్రయోజనాలు పొందుతూ వచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీసీ, రిజిసా్ట్రర్‌లను మార్చారు. కొత్త ప్రభు త్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఈసీ మెంబర్ల ద్వారా క్షణంలో వైసీపీ నాయకులకు సమాచారం చేరిపోతోంది. ఈ అంశం కొత్తగా కొలువు తీరిన వర్సిటీల యాజమాన్యాలకు తలనొప్పిగా మారిందని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ఇంకా వైసీపీ పాలనే కొనసాగుతున్నట్లుగా ఉందని పెదవి విరుస్తున్నాయి.

లెక్కలేనన్ని అక్రమాలు...

సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలక మండలిని వైసీపీ నాయకులు చేతుల్లోకి తీసుకున్నారు. వారికి అవసరమైన పనులను మాత్రమే అజెండాల్లో చేర్చి చక్కబెట్టుకున్నారు. నిర్మాణాలు, టెండర్లు, సరఫరా.. ఇలా ప్రతిపనిని వైసీపీ నాయకులే చేజిక్కించుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు.

- రమణ, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

కొత్త ఈసీలను ఏర్పాటు చేయాలి

జేఎనటీయూ, ఎస్కేయూ పాలక మండళ్లను కొత్తగా ఏర్పాటు చేయాలి. అభివృద్ధికి అడుగులు వేసేలా సమావేశాలను నిర్వహించాలి. కూటమి ప్రభుత్వం అవినీతికి తావులేకుండా పాదర్శకంగా పని చేయాలి.

- వేమన, ఏఐఎ్‌సఏ రాష్ట్ర అధ్యక్షుడు

అడ్డమైన నిర్ణయాలు...

ప్రభుత్వం మాదే, పాలక మండలిలోనూ మేమేనంటూ వైసీపీ నాయకులు అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులకు ప్రమోషనలు ఇవ్వకుండా అనర్హులను అందలమెక్కించారు. అయిన వారికి దోచిపెట్టేందుకు కాంట్రాక్టులన్నీ కట్టబెట్టారు. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించారు. ఇలా ఐదేళ్లలో ఇష్టానుసారంగా వ్యవహరించారు.

- ధనుంజయ నాయుడు, టీఎనఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 04 , 2024 | 12:22 AM