ROAD: ఎల్లోటి రహదారి గుంతలమయం
ABN , Publish Date - May 27 , 2024 | 11:52 PM
మండలంలోని ఎల్లోటి గ్రామానికి వెళ్లే ప్రధాన రహ దారి గుంతలమ యం కావడంతో గ్రా మస్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అది మడకశిర పట్టణం నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక సరిహద్దు గ్రామం. ఆ గ్రామస్థులు మడకశిరకు రాకపోకలు సాగించాలంటే హిందూపురం-మడకశిర ప్రధాన రహదారిలో ఉన్న తడకలపల్లికి రావాలి. తడకలపల్లి నుంచి ఎల్లోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
మడకశిర రూరల్, మే 27 : మండలంలోని ఎల్లోటి గ్రామానికి వెళ్లే ప్రధాన రహ దారి గుంతలమ యం కావడంతో గ్రా మస్థులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. అది మడకశిర పట్టణం నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక సరిహద్దు గ్రామం. ఆ గ్రామస్థులు మడకశిరకు రాకపోకలు సాగించాలంటే హిందూపురం-మడకశిర ప్రధాన రహదారిలో ఉన్న తడకలపల్లికి రావాలి. తడకలపల్లి నుంచి ఎల్లోటి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ మట్టిరో డ్డు మొత్తం గుంతలమయం కావడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం ఆ గుంతల్లో నీరు నిలిచి వారు రాకపోకలకు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్థులు అత్యవసర పరిస్థితిలో ఈ రహదారి గుండా మడకశిర పట్టణానికి చేరుకునేందుకు వారు చాలా అవస్థలు పడుతున్నారు. దారి సరిగా లేకపోవడంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా ఆ గ్రామానికి వెళ్లలేక పోతున్నాయి. అధికారులు స్పందించి గుంతల మెయమైన రహదారికి మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....