JJM Scheme : జల్ జీవన్ మిషన్‌లో రూ.11,400 కోట్ల పనులు రద్దు
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:21 AM
రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కార్యక్రమం కింద రూ.11,400 కోట్ల అంచనా వ్యయంతో బోర్‌వెల్స్...
తాజా డీపీఆర్‌లతో కొత్తగా టెండర్లు
అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కార్యక్రమం కింద రూ.11,400 కోట్ల అంచనా వ్యయంతో బోర్‌వెల్స్ ఆధారంగా మంజూరు చేసిన 44,195 పనులను ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే రూ.7,910.10 కోట్ల అంచనాతో ఐదు మల్టీ విలేజ్ స్కీమ్స్ (ఎంవీఎ్‌స)కు సంబంధించిన ఒప్పందాలను కూడా రద్దుచేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. జేజేఎం సవరణలో భాగంగా.. సవరించిన డిజైన్లతో వీటికి తాజా టెండర్లు పిలవాలని ఆదేశించింది. ఎంపిక చేసిన ఏజెన్సీలు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)లు రూపొందించాలని స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న 33,717 పనులను పూర్తిచేయడానికి ఒప్పందం గడువును మరో ఆరు నెలలకు పొడిగిస్తున్నట్లు పంచాయతీరాజ్-గ్రామీ ణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్‌సీ ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.