-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh and Telangana and Jagan Tirumal visit and Tirupati Laddu row and Telugu Latest News Live updates on Friday 27 September 2024 psnr
-
Live Updates: నా మతం ఇదే.. జగన్ సంచలన కామెంట్స్..
ABN , First Publish Date - Sep 27 , 2024 | 07:26 AM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-09-27T16:36:28+05:30
నా మతం ఇదే.. జగన్ సంచలన కామెంట్స్..
గుడికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుందామంటే నా మతం ఏంటని అడుగుతున్నారు.
డిక్లరేషన్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.
రాసుకోండి.. నా మతం మానవత్వం.
ఇంట్లో నేను బైబిల్ చదువుతాను.
గుడికి వెళ్తే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తాను.
ముస్లిం, సిక్కు మతాలనూ గౌవరిస్తాను, అనుసరిస్తాను.
గతంలో నా తండ్రి తిరుమల శ్రీవారికి ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారు.
నేను ఆయన కొడుకునే కదా..
నేను సీఎం అయ్యాక శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాను.
మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం.
మాజీ ముఖ్యమంత్రిగా నేను తిరుమలకు వెళ్లకూడదా?
తొలిసారి తిరుమలకు వెళ్తున్నాను అనుకుంటే ఏమో అనుకుంటాం.
పదిహేనుసార్లకు పైగా తిరుమలకు వెళ్లాను.
ఒక మాజీ సీఎంకే ఈ పరిస్థితి ఎదురైతే.. దళితుల పరిస్థితి ఏంటి?
-
2024-09-27T15:45:26+05:30
పోలీస్ స్టేషన్లో ఆర్‌పీ పట్నాయక్ ఫిర్యాదు
రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ ఫిర్యాదు
తన కొడుకు వైష్ణవ్‌ని ర్యాగింగ్ చేస్తూ చెవి కొరికినట్లు ఫిర్యాదు
ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న ఆర్‌పి తనయుడు వైష్ణవ్
అదే కాలేజీలో సీనియర్ విద్యార్థి శ్యామ్ బస్‌లో వైష్ణవ్‌తో గొడవ
ఆవేశంతో చెవి కొరికిన శ్యామ్
శ్యాంపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
నిన్న రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆర్‌పీ పట్నాయక్ ఫిర్యాదు.
-
2024-09-27T15:33:15+05:30
వైఎస్ జగన్‌కు డిక్లరేషన్ భయం
డిక్లరేషన్ భయంతోనే తిరుమల పర్యటన రద్దు
కాసేపట్లో మీడియా ముందుకు వైఎస్ జగన్
-
2024-09-27T15:12:16+05:30
జగన్ తిరుమల పర్యటన రద్దు
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దు
లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో తిరుమలకు జగన్ వస్తారని వైసీపీ ప్రకటన
డిక్లరేషన్ గురించి సర్వత్రా చర్చ
డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీడీపీ, బీజేపీ నేతల డిమాండ్
హిందు సంఘాలు, హిందువుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత
వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన జగన్
తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్
-
2024-09-27T14:45:00+05:30
తిరుమల పర్యటనపై జగన్ కీలక నిర్ణయం
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
తిరుమల పర్యటనపై వివాదం
డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్
-
2024-09-27T13:59:58+05:30
ఐటీ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి: ఐటీ పాలసీపై ముగిసిన సీఎం చంద్రబాబు సమీక్ష
ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన పై చర్చ.
ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రొత్సహాకాలు ఇవ్వాలని భావిస్తోన్న ప్రభుత్వం.
విశాఖ కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రణాళికలపై డిస్కషన్.
ఐటీ సేవల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని భావిస్తోన్న సర్కార్.
ఐటీ సేవలు, ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాలసీ రూపకల్పన చేయాలని సీఎం చంద్రబాబు సూచన.
ఐటీ రంగం ద్వారా భారీగా ఉపాధి కల్పించి.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల మందికి ఉపాధి హామీని నెరవేర్చేలా ప్రణాళిక.
-
2024-09-27T13:52:20+05:30
వైఎస్ షర్మిల కామెంట్స్
రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ పశ్చాత్తాప దీక్ష.. జగన్ ప్రక్షాళన దీక్షలు చేస్తున్నాం: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల
రాష్ట్రంలో ఒకరిపై ఒకరు పోటిపడి మత రాజకీయాలు చేస్తున్నారు
జగన్ సర్కారు తిరుమల లడ్డూను కల్తీ చేసింది
వైసీపీ హయాంలో మార్కెట్ కంటే తక్కువకే ..జగన్ సర్కారు నెయ్యి కొనుగోలు చేసింది
లడ్డూలకు వాడే నెయ్యిలో జంతు కొవ్వులు ఉన్నాయని ల్యాబ్‌లో నిర్దారించారు
నెయ్యి కల్తీ జరిగిందనే విషయం సీఎం చంద్రబాబుకు తెలుసు
సాక్ష్యాలు ,రిపోర్టులు ఉన్నా సీఎం చంద్రబాబు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
హిందూ మతంపై దాడి అని బీజేపీ మాట్లాడుతోంది
-
2024-09-27T12:21:04+05:30
జగన్.. తిరుమల రావొద్దు
కర్నూలు: వైసీపీ అధినేత జగన్ తిరుపతికి రావద్దంటూ నిరసనలు
కల్లూరు శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి ఆలయం వద్ద నోటికి శూలాలు గుచ్చుకొని భక్తుల వినూత్న నిరసన.
సంఘీభావం తెలిపిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.
జగన్ హిందూ ద్రోహి, వెంకటేశ్వర స్వామిని నిలువు దోపిడీ చేసిన జగన్ దొంగ దర్శనం కోసం తిరుపతికి వస్తున్నాడు
రెడ్లకు ప్రతి ఇంటికి ఒక కుల దైవం ఉంటారు
మా ఇంటి కుల దైవం వీరభద్ర స్వామి.
జగన్‌కు కులమే లేదు. కులదైవం ఎక్కడి నుంచి వస్తుంది.
కడప అనేది దేవుని గడప. దుర్మార్గులు కడప పేరును మార్చారు.
కడపకు వైయస్సార్ జిల్లా అని పేరు పెట్టుకున్నారు. పవిత్రమైన కడప పేరును బ్రిటిష్ వాళ్ళు కూడా మార్చడానికి సాహసం చేయలేదు
జగన్ తన సొంత జిల్లాకు కొవ్వు జిల్లా గొడ్డు మాంసం జిల్లాగా అని పేరు పెట్టుకోండి సరి పోతుంది
ముఖ్యమంత్రి చంద్రబాబు వైయస్సార్ జిల్లా పేరును తీసేసి కడప జిల్లాగా తిరిగి మార్చాలి
భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు జగన్ తిరుపతికి వెళ్లాలనుకుంటున్నాడు.
తిరుపతిని అపవిత్రం చేసిన జగన్ వెంకటేశ్వర స్వామి సన్నిధికి రావడానికి అనర్హుడు
ఏదో ఒక రోజు జగన్‌ను బట్టలు విప్పి సుంకులమ్మ కొరడాలతో జనం కొట్టడం ఖాయం. దీనికి మించిన ప్రాయశ్చిత్తం లేదు.
-
2024-09-27T12:11:00+05:30
మంత్రి నారా లోకేశ్
తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలి
పులివెందుల ఎమ్మెల్యే జగన్ విధిగా డిక్లరేషన్ సమర్పించాలి
హిందు సంప్రదాయాలను జగన్ గౌరవించాలి
-
2024-09-27T12:00:31+05:30
హైడ్రా అటెన్షన్
హైదరాబాద్: ఆందోళనలతో రణరంగాన్ని తలపిస్తోన్న మూసీ పరివాహక ప్రాంతాలు.
చైతన్య పురి, కొత్తపేట్, నాగోల్‌లో సర్వే అధికారులకు ప్రజల నుంచి ప్రతిఘటన
వినాయక నగర్, గణేష్ నగర్‌లో మూసి బాధితులకు బీజీపే ఎంపీ ఈటల రాజేందర్, కార్పొరేటర్లు సంఘీభావం.
-
2024-09-27T10:55:03+05:30
మంత్రి పొంగులేటి నివాసాల్లో ఈడీ సోదాలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసాలపై ఈడీ సోదాలు
ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు
15 చోట్ల సోదాలు చేస్తున్న ఈడీ అధికారులు
గతంలో ఎన్నికల సమయంలో సోదాలు చేసిన ఈడీ అధికారులు
-
2024-09-27T10:42:28+05:30
మూసి నివాసిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న సర్వే
అధికారులను అడ్డుకుంటున్న స్థానికులు
ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అధికారులను వెనక్కి పంపిస్తున్న ప్రజలు
కొత్తపేట మారుతి నగర్‌లో నిలిచిపోయిన మూసీ సర్వే
మూసీ బాధితులకు మద్దతు తెలిపిన ఎల్‌బీ నగర్ బీజేపీ కార్పొరేటర్లు
బాధితుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించిన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్
-
2024-09-27T10:35:15+05:30
వెంకటరెడ్డి అరెస్టుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ
ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్ట్‌పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు
ప్రభుత్వ ఖజానాకు రూ.2,566 కోట్ల ఆదాయానికి నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న ఏసీబీ
ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏ1గా వెంకటరెడ్డి
ఏ2 గా జేపీ వెంచర్స్ ప్రతినిధి అనిల్ ఆత్మారామ్ కామత్
ఏ3 గా ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధి పీ.అనిల్ కుమార్
ఏ4గా జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రతినిధి ఆర్.వెంకట కృష్ణారెడ్డి
ఏ5గా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్)
ఏ6గా ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(హైదరాబాద్)
ఏ7గా జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఇతరులు నిందితులుగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న ఏసీబీ అధికారులు
-
2024-09-27T10:27:43+05:30
హైదరాబాద్‌లో మైనింగ్ ఎండీ వెంటకరెడ్డి అరెస్ట్
అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు
వెంకటరెడ్డిని హైదరాబాద్ నుంచి విజయవాడ ఏసీబీ హెడ్ క్వార్టర్ కు తరలించిన అధికారులు
విజయవాడ తీసుకెళ్తున్న సమయంలో కొన్ని కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఏసీబీ కార్యాలయంలో వెంకట రెడ్డి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్న అధికారులు
మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్న అధికారులు
-
2024-09-27T09:49:26+05:30
రఘురామ కేసులో కీలక పరిణామం.. కస్టడీలో చిత్రహింసలు నిజమే
రఘురామకృష్ణరాజు కేసులో సీఐడీ విచారణ
కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే
విచారణ అధికారులకు వాంగూల్మం ఇచ్చిన అప్పటి సీఐడీ సిబ్బంది
వీడియో కాల్‌లో సీఐడీ చీఫ్‌కు చూపించడంతో అలా కాదు కొట్టేది అని సునీల్ కుమార్ చెప్పినట్టు వాంగ్మూలం
వెంటనే ముసుగేసుకున్న నలుగురిని తీసుకుని సునీల్ కుమార్ పైకి వచ్చారని పేర్కొన్న పోలీసులు
ఆయన సమక్షంలోనే రఘురామ రాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వెల్లడి
గూగుల్ టేక్ఔట్ ద్వారా సునీల్ కుమార్ కదలికలను గుర్తించిన పోలీసులు
రఘురామను కొడుతూ.. వీడియోకాల్లో తమ చీఫ్‌కు చూపామన్న సీఐడీ పోలీసులు
ముసుగేసుకున్న నలుగురితో కలిసి సీఐడీ చీఫ్ సునీల్ వచ్చారన్న సెంట్రీ
అందరి నుంచీ వాంగ్మూలాలు తీసుకున్న గుంటూరు పోలీసులు
సీఐడీ చీఫ్‌గా పని చేసిన సునీల్ అప్పటి కాల్ డేటాపై ఆరా
అడ్డంగా బుక్కైన నాటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్
సీఐడీ అప్పటి విచారణ అధికారి విజయ్ పాల్‌కు మెడకు ఉచ్చు
రఘురామపై ఒంటిపై గాయాలు ఉన్నాయని జీజీహెచ్ వైద్యుల వాంగ్మూలం
అప్పటి జీజీహెచ్ సూపరిండెంట్ ప్రభావతిపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి
తప్పుడు నివేదికను కోర్టుకు సమర్పించిన ప్రభావతి
కొలిక్కి వచ్చిన దర్యాప్తు
విజయ్ పాల్ కోసం విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు
-
2024-09-27T08:47:41+05:30
‘దేవర’ టికెట్ రూ.1500 - 2500లకు అమ్మకం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దేవర సినిమా టిక్కెట్లు అధిక ధరలకు అమ్ముతూ దోపిడీ
ఒక్కో టికెట్ రూ.1500 నుంచి రూ.2500 వరకు అమ్ముతున్న వైనం
ఎన్టీఆర్ అభిమానులను దోచుకుంటున్న థియేటర్ యాజమాన్యాలు
అధిక ధరలకు టికెట్స్ అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు
అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్న అభిమానులు
-
2024-09-27T08:36:45+05:30
ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు
గుంటూరు జిల్లాలో ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు
వైసీపీ పాలనలో చెలరేగిన ఇద్దరు సీఐలు
సీఐలు రాంబాబు, బిలాలుద్దీన్‌లు సస్పెన్షన్
వైసీపీ హయాంలో చెలరేగిన అధికారులు
విచారణ అనంతరం సస్పెండ్ చేసిన ఐజీ త్రిపాఠి
-
2024-09-27T08:11:02+05:30
నంద్యాల: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
ఇన్ ఫ్లో : 1,19,437 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 36,904 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 877.40 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 174.6962 టీఎంసీలు
ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిన అధికారులు
-
2024-09-27T07:35:36+05:30
దేవరకు అభిమానుల తాకిడి... పోలీసుల లాఠీఛార్జ్
ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాను చేసేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు
విడుదల సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో గుమిగూడిన అభిమానులు
అభిమానుల తాకిడి ఎక్కువగా కావడంతో లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
-
2024-09-27T07:26:56+05:30
తిరుపతిలో టెన్షన్..
తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ కొండకు రావద్దంటూ హిందూ సంఘాల నిరసన
క్రిస్టియన్ జగన్ గో బ్యాక్.. అంటూ నినాదాలు.
డిక్లరేషన్ ఇవ్వాలంటూ బీజేపీ నేతల డిమాండు.
తిరుమలకు రావాలంటే అడ్డుకుంటామని హెచ్చరికలు.
శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నేడు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లనున్న మాజీ సీఎం జగన్
దీంతో గురువారం తిరుపతిలో నిరసనలు
ఈ క్రమంలో తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది
జగన్ షెడ్యూల్ ఇలా: శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విమానాశ్రయానికి రాక. రోడ్డు మార్గాన 7 గంటలకు తిరుమల చేరిక. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస. శనివారం ఉదయం 10.30 గంటలకు శ్రీవారి దర్శనం. మధ్యాహ్నం తిరుగు ప్రయాణం.
భారీగా జనసమీకరణ
మరోవైపు జగన్ వైసీపీ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలూ భారీ ఎత్తున జనసమీకరణ చేసినట్లు తెలిసింది. పోలీసులు అడ్డుకోని పక్షంలో జగన్‌నేరుగా తిరుమల వెళతారని, ఎక్కడైనా అడ్డుకుంటే అక్కడే శ్రేణులతో కలసి బైఠాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తిరుమలకు అనుమతించే వరకూ వెనుదిరగకుండా ఆందోళన చేపట్టడం ద్వారా వివాదం పెద్దది చేసి అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేయనున్నట్టు తెలిసింది. వైసీపీ నేతల వ్యూహానికి ప్రతివ్యూహంగా పోలీసులు విమానాశ్రయం వద్దే జగన్‌ను అడ్డుకునే అవకాశముందని సమాచారం. విమానాశ్రయంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చి, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం వెనుదిరిగి పోవాల్సిందిగా కోరనున్నట్టు సమాచారం. అలా కాకుండా వెలుపలికి రావాలని యత్నిస్తే అడ్డుకునే అవకాశముంది. దీనికోసం విమానాశ్రయం వద్ద ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.