-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh and Telangana and Tirupati Laddu row and Telugu Latest News Live updates on Monday 23 September 2024 psnr
-
Live Updates: తిరుమల శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం ప్రారంభం
ABN , First Publish Date - Sep 23 , 2024 | 07:07 AM
Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
2024-09-23T16:01:34+05:30
ఆస్కార్‌లో ‘లా పట్టా లేడీస్’ ఎంట్రీ
ఆస్కార్ బరిలోకి మూడోసారి అమీర్ ఖాన్ సినిమా
లా పట్టా లేడీస్ సినిమాకు దర్శకత్వం వహించిన కిరణ్ రావు
అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు
Oscars 2025: భారత్ అఫీషియల్ ఎంట్రీ.. ‘లా పట్టా లేడీస్’! ముచ్చటగా మూడో సారి అమీర్ ఖాన్ సినిమా
-
2024-09-23T14:01:21+05:30
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కేఏల్ పాల్ పిటిషన్‌పై హైకోర్ట్ కీలక ఆదేశాలు
ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
ఎలక్షన్ కమిషన్, స్పీకర్, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆర్డర్
పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధమన్న కేఏ పాల్
పాల్ పిటిషన్‌ను విచారణకు అనుమతించిన న్యాయస్థానం
ప్రతివాదులకు నోటీసులు జారీ
తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా
కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశం
రాజీనామాలు చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారాలు అనుభవిస్తున్నారన్న కేఏ పాల్ తరపు న్యాయవాదులు
1975 లో ఇందిరా గాంధీపై అలహాబాద్ కోర్ట్ అనర్హత వేటు వేసిందని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లిన పాల్
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
ఎలక్షన్ కమిషన్, స్పీకర్, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆర్డర్
పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేఏ పాల్ వాదనలు
-
2024-09-23T13:21:16+05:30
హైడ్రాకు హైకోర్ట్ బ్రేకులు.. దుర్గం చెరువు పరిసర నివాసితులకు రిలీఫ్
దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట
దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే
2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన దుర్గం చెరువు పరిసన నివాసితులు
అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలన్న హైకోర్ట్
అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నివాసితులు హాజరు కావాలని ఆదేశం
అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుంచి 6 వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలి
లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశం
-
2024-09-23T12:57:40+05:30
ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం
ఐపీఎస్ అధికారులను నిందితులుగా చేర్చిన పోలీసులు
కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో వీరి పేర్లను చేర్చిన పోలీసులు
ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా తాతా, విశాల్ గన్నీని నిందితులుగా చేర్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు
ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసి ఈరోజు తెల్లవారుజామున జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు
అక్టోబర్ 4 వరకు విద్యాసాగర్‌కు రిమాండ్ విధించిన కోర్ట్
జెత్వానీ కేసులో దర్యాప్తు అధికారిని కూడా నిందితులుగా చేర్చిన పోలీసులు
-
2024-09-23T12:12:12+05:30
తిరుమలలో ముగిసిన మహా శాంతి యాగం
శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం చేపట్టిన మహా శాంతియాగం ముగింపు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో యాగం
పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం పూర్తి
సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతిహోమం నిర్వహణ
ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు నిర్వమణ
ముందుగా మహాశాంతి యాగం, వాస్తు హోమం
-
2024-09-23T11:05:00+05:30
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సొంత బాబాయ్ రూప్ కుమార్
అనిల్ కుమార్ యాదవ్ ఒక ఆర్కెస్ట్రా ఆర్టిస్ట్
మంత్రి నారాయణ మీద పెట్టిన కేసులు, వేధింపులు ఎవరి మీద ఉండవు
అక్రమ అరెస్టులు, వేధింపులు తట్టుకొని 72 వేల ఓట్ల మెజార్టీతో నారాయణ గెలిచారు
అనిల్ కుమార్ యాదవ్ మాదిరిగా భయపడి నియోజకవర్గం నుంచి వెళ్లిపోలేదు
ప్రతి సంవత్సరం రూ.10 కోట్ల సొంత నిధులు కార్యకర్తలకు కేటాయించిన నాయకుడు నారాయణ
వీపీఆర్ దంపతుల పేర్లు ఉచ్ఛరించే అర్హత కూడా అనిల్‌కి లేదు
ఫతేఖాన్ పేటలో కూలిడ్రింక్ షాపులో పనిచేసుకునే అనిల్, ఎమ్మెల్యే ఎలా అయ్యాడు?
నెల్లూరు జిల్లాను అనిల్ కుమార్ యాదవ్ సర్వనాశనం చేశాడు
అనిల్ కుమార్ యాదవ్‌ను ఎమ్మెల్యేని, మంత్రిని చేసింది మా లాంటి కార్యకర్తలే
టీడీపీలోకి వెళ్తున్న కార్పొరేటర్లని జనసేన పార్టీలోకి వెళ్లమని చెబుతూ వైసీపీకి అనిల్ వెన్నుపోటు పొడుస్తున్నాడు
-
2024-09-23T10:42:11+05:30
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (సోమవారం) లాభాలతో ప్రారంభం
ఉదయం 10.15 గంటలకు సెన్సెక్స్ 290 పాయింట్లు పెరుగుదల
నిఫ్టీ 118 పాయింట్లు వృద్ధి
బ్యాంక్ నిఫ్టీ 165 పాయింట్లు లాభం
నిఫ్టీ మిడ్ క్యాప్-100 సూచీ 352 పాయింట్లు వృద్ధి
-
2024-09-23T10:14:00+05:30
మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను కూలుస్తున్న హైడ్రా సిబ్బంది
పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు
స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా అధికారులు
నిర్మాణాలను తొలగించి కావూరిహిల్స్ పార్క్ అని బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు
కావూరి హిల్స్ అసోషియషన్ నుంచి 25 సంవత్సరాలపాటు లీజుకు తీసుకున్నామని ఆరోపించిన స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు
తమ గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆరోపణ
-
2024-09-23T10:09:27+05:30
పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పిటిషన్‌పై మరికాసేపట్లో హైకోర్టులో విచారణ
పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేఏ పాల్ పిటిషన్
పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధమన్న పాల్
నేడు అఫిడవిట్ దాఖలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
రాజీనామాలు చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారాలు అనుభవిస్తున్నారన్న పాల్
రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్న పిటిషనర్
-
2024-09-23T10:01:53+05:30
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ ముగ్గురు సభ్యుల కమిటీ
10 గంలకు గాంధీ ఆస్పత్రికి బీఆర్ఎస్ నేతలు తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
తమను పోలీసులు అడ్డుకుంటున్నారని కమిటీ మెంబర్స్ ఆరోపణ
పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ త్రిసభ్య కమిటీ సభ్యులు
-
2024-09-23T09:57:04+05:30
లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశాలు
తిరుమల లడ్డూ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
ఈ మేకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
దర్యాప్తునకు సంబంధించిన విధివిధానాలు రూపొందించే అవకాశం
దర్యాప్తు అధికారిగా ఎవర్ని నియమించాలనే అంశంపై ప్రభుత్వం కసరత్తు
ఈరోజు (సోమవారం) సాయంత్రానికి దర్యాప్తు అధికారి పేరుతో జీవో విడుదల చేసే యోచనలో ప్రభుత్వం
-
2024-09-23T09:02:14+05:30
రికార్డు క్రియేట్ చేసిన హైడ్రా
అమీన్‌పూర్‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్
17 గంటలపాటు నాన్ స్టాప్‌గా కూల్చివేతలు
ఓ హాస్పిటల్, 2 అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమి స్వాధీనం
పటేల్ గుడాలో 16 విల్లాలు కూల్చివేసిన హైడ్రా అధికారులు
రాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన కూల్చివేతలు
హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా రాత్రి, పగలు కూల్చివేతలు
అక్రమ నిర్మాణాలకు ఆనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు
17 గంటలపాటు హైరిస్క్ ఆపరేషన్ కొనసాగించిన హైడ్రా
-
2024-09-23T08:40:03+05:30
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు చోరీకి విఫలయత్నం
బస్సును తీసుకెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం
స్థానికులు ఆరా తీయడంతో బయటపడ్డ అసలు విషయం
దొంగను పోలీసులకు అప్పగించిన స్థానికులు
-
2024-09-23T08:34:19+05:30
ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం
జెత్వానీ ఫిర్యాదు మేరకు కుక్కల విద్యాసాగర్ అరెస్టు
డెహ్రాడూన్ నుంచి నిన్న (ఆదివారం) రాత్రి రైలులో విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు
ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యా సాగర్‌కు ముగిసిన మెడికల్ టెస్టులు
తెల్లవారు జామున 4వ ఏసీఎంఎం జడ్జీ ఇంటి వద్ద విద్యాసాగర్‌ను హాజరు పరిచిన పోలీసులు
అక్టోబరు 4వ తేదీ వరకు కుక్కల విద్యాసాగర్‌కు రిమాండ్ విధింపు
-
2024-09-23T08:01:25+05:30
రామప్ప ఆలయ పరిసరాల్లో గుప్తనిధుల కోసం వేట
యూనెస్కో గుర్తింపు పొందిన ప్రదేశంలో ఊహించని పరిణామం
గొల్లాలగుడి ఆలయ పైకప్పు పగలగొట్టి లోపలికి చొరబడిన గుర్తుతెలియని దుండగులు
గొల్లాలగుడిలోని శివలింగాన్ని పెకిలించిన దుండగులు
గుప్తనిధుల తవ్వకాలపై పోలీస్ స్టేషన్‌లో స్థానికుల ఫిర్యాదు
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
రామప్ప టెంపుల్ దగ్గర భద్రత లేకపోవడంతోనే దుండగులు రెచ్చిపోతున్నారని స్థానికుల ఆరోపణ
-
2024-09-23T07:44:50+05:30
కడప జిల్లా మైదుకూరు పట్టణంలో భారీ చోరీ
మిట్టా జువెల్లెర్స్ షాపులో జరిగిన దొంగతనం
కేజీ బంగారు నగలు, పెద్ద ఎత్తున వెండి వస్తువులు దోచుకెళ్లిన దొంగలు
దుకాణం వెనుక నుంచి బాత్రూమ్‌కు రంద్రం చేసి దుకాణంలోకి చొరబడ్డ దొంగలు
సీసీ కెమెరా హార్డ్ డిస్క్‌ను సైతం లేకుండా పగులకొట్టి తీసుకెళ్లిన దొంగలు
-
2024-09-23T07:16:39+05:30
ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల ఘర్షణ
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో గణేష్ నిమజ్జనంలో అర్ధరాత్రి ఉద్రిక్తత
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్, బీఆర్ ఎస్ శ్రేణుల మధ్య గొడవ
సునీతా లక్ష్మారెడ్డి ఇంట్లోకి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి తమపై దాడి చేశారంటున్న ఎమ్మెల్యే వర్గీయులు
ఆ సమయంలో ఇంట్లో లేని ఎమ్మెల్యే
ఇరువర్గాలను అక్కడి నుంచి తరిమివేసిన పోలీసులు
గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు
-
2024-09-23T07:07:42+05:30
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతియాగం
ఆలయంలోని యాగశాలలో హోమం నిర్వహిస్తూన్న ఆగమ పండితులు, అర్చకులు
శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ కారణంగా శ్రీవారి ఆలయంలో హోమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడి
హోమం పూర్తైన తర్వాత లడ్డూ పోటుతో పాటు ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాని నిర్వహిస్తామన్న ఈవో శ్యామల రావు
ముగ్గురు ఆగమ పండితులు, 8 మంది అర్చకులతో హోమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడి