Share News

AP Athletes : స్కూల్‌ గేమ్స్‌ కరాటేలో ఏపీకి స్వర్ణం

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:27 AM

జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారులు సత్తా చాటారు. కరాటేలో స్వర్ణ, కాంస్య పతకాలతోపాటు బ్యాడ్మింటన్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌లోనూ పతకాలు సాధించినట్టు పాఠశాల విద్యాశాఖ ఆదివారం తెలిపింది.

AP Athletes : స్కూల్‌ గేమ్స్‌ కరాటేలో ఏపీకి స్వర్ణం

  • బ్యాడ్మింటన్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌లో పతకాలుజాతీయ స్కూల్‌

  • గేమ్స్‌లో సత్తాచాటిన ఏపీ క్రీడాకారులు

అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి స్కూల్‌ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారులు సత్తా చాటారు. కరాటేలో స్వర్ణ, కాంస్య పతకాలతోపాటు బ్యాడ్మింటన్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌లోనూ పతకాలు సాధించినట్టు పాఠశాల విద్యాశాఖ ఆదివారం తెలిపింది. ఈ నెల 9న ప్రారంభమైన స్కూల్‌ గేమ్స్‌ ఆదివారం ముగిశాయి. కరాటే అండర్‌-17 (66 కిలోల విభాగం)లో మన్నెపు వెంకట దినేష్‌ స్వర్ణం సాధించాచగా.. 45 కిలోల విభగాంలో జవంగుల కాశీ సాయిచంద్ర భార్గవ్‌ కాంస్యం గెలుపొందాడు. బ్యాడ్మింటన్‌ అండర్‌-14 బాలుర టీమ్‌ విభాగంలో సమ్మెట్ల హేమంత్‌, పి.రోషన్‌, డీవీ యజ్ఞనాథ్‌, వైఈ అఖిల్‌ ప్రకాశ్‌, కాటం ఈశ్వర్‌ సాయి.. రజత పతకంతో మెరిశారు. బ్యాడ్మింటర్‌ అండర్‌-14 బాలికల టీమ్‌ విభాగంలో డీవీ యజ్ఞశ్రీ, ఇత్తంశెట్టి తన్వి, నాగిరెడ్డి సాహితీ, శ్రీరామ్‌ కావ్య, గూడూరు సుష్మారెడ్డి కూడా రజతం సాధించారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో జి.మధు చందన (87 కిలోలు) రజత పతకం, కారంగి హేమశ్రీ (55 కిలోలు) కాంస్య పతకం, పి.ఆర్‌.రీనుమొల్‌ (71 కిలోలు) కాంస్య పతకం సాధించారు. బాక్సింగ్‌ 57-60 కిలోల విభాగంలో సిరివరకు మిహీర రజత పతకం, నెల్లి గణేష్‌ కాంస్య పతకం సాధించారు. విజేతలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అభినందించారు.

Updated Date - Dec 16 , 2024 | 05:27 AM