Home » Athletics
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారులు సత్తా చాటారు. కరాటేలో స్వర్ణ, కాంస్య పతకాలతోపాటు బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్‌లోనూ పతకాలు సాధించినట్టు పాఠశాల విద్యాశాఖ ఆదివారం తెలిపింది.
‘‘పుట్టినప్పుడు మా అమ్మానాన్నలు నాకు పెట్టిన పేరు అక్రమ్ పాషా. కానీ పెరిగే క్రమంలో నాలో ఏవో విభిన్న భావాలు. చుట్టుపక్కల పిల్లల్లో నేను ప్రత్యేకంగా కనిపించేదాన్ని. అందరూ నన్ను వింతగా చూడడం మొదదలుపెట్టారు.
‘పారిస్ ఒలింపిక్స్ మంచి అనుభవం ఇచ్చింది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే సమ్మర్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించే దిశగా సాధన చేయడమే నా ముందున్న లక్ష్యం’ అని నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్ ఎర్రాజీ జ్యోతి తెలిపింది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో(Paris Olympics 2024) మారథాన్ స్విమ్మర్లు, ట్రయాథ్లెట్ల ఈవెంట్లు సెయిన్ నది(Seine river)లో జరుగనుండగా కాలుష్యం కారణంగా మొదటి శిక్షణా సెషన్‌ను ఆదివారం రద్దు చేశారు. ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో నిరంతరంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నీటి కాలుష్య ప్రభావంపై ఆందోళనలు వచ్చిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత స్టార్ క్రీడాకారుడు, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) గాయపడ్డాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలోనే అతనికి గాయమైంది. ప్రపంచ ఛాంపియన్ నీరజ్ చోప్రా కొన్ని వారాల క్రితం శిక్షణ సమయంలో కండరాల గాయంతో బాధపడ్డాడు.
అల్ఫియా జేమ్స్...ఒకప్పుడు బాస్కెట్‌బాల్‌లో దేశానికి ఆశాకిరణమైన ఆమె ఒక దుర్ఘటన వల్ల వీల్‌ఛైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ ఆ వైకల్యాన్ని ఆమె ఆత్మవిశ్వాసంతో ఎదిరించారు. పారా-బ్యాడ్మింటన్‌లో పతకాల పంట పండిస్తూ...
పారిస్ ఒలింపిక్స్(Paris Olympic Games) ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మంటలు రేపే అథ్లెట్లకు కాసుల వర్షం కురవనుంది. ఈ క్రీడల్లో స్వర్ణం సాధించిన అథ్లెట్‌కు(Athletes) సుమారు 42 లక్షల (50 వేల డాలర్లు) ప్రైజ్‌మనీని(Prize money) ప్రకటిస్తూ వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) సంచలన నిర్ణయం తీసుకొంది. మెగా ఈవెంట్లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌కు సంబంధించిన 48 క్రీడాంశాల్లో..
వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌ప్స(World Athletics Championships).. ప్రపంచ మేటి అథ్లెట్లు తలపడే గ్రాండ్ ఈవెంట్. ప్రతిష్ఠాత్మక పోటీలకు 28 మంది భారత అథ్లెట్లు అర్హత సాధించారు. అయితే, వీరిలో ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా(Olympic champion Neeraj Chopra) మినహా మిగతా వారిపై పెద్దగా పతక ఆశలు లేవు. కొందరు అనుభవం కోసం తలపడనుండగా.. వెటరన్లు తమ రికార్డులను మెరుగుపర్చుకోవడానికి చూస్తున్నారు.