Share News

CM Chandrababu: బుధవారం ఏపీ కేబినెట్ భేటీ.. ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం

ABN , Publish Date - Oct 15 , 2024 | 06:44 PM

చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఆ క్రమంలో దీపావళి పండగ వేళ.. మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. అందుకోసం బుధవారం అంటే.. అక్టోబర్ 16వ తేదీ ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

CM Chandrababu: బుధవారం ఏపీ కేబినెట్ భేటీ.. ఈ నిర్ణయాలు తీసుకునే అవకాశం

అమరావతి, అక్టోబర్ 15: చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఆ క్రమంలో దీపావళి పండగ వేళ.. మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. అందుకోసం బుధవారం అంటే.. అక్టోబర్ 16వ తేదీ ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది.

Viral Video: రైలు విండోలో నుంచి జారీ పడిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?


వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై నిర్ణయించే అవకాశముందని సమాచారం. అలాగే చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇక 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీ ప్రతిపాదనపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ చేసేందుకు పలు ప్రతిపాదనకు రానున్నాయి. వాటిపై చర్చించి.. కేబినెట్ ఓ నిర్ణయం తీసుకోనుంది.

Also Read: వయనాడ్ ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన సీఈసీ


దేవాలయాల పాలక మండలిలో 15 నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై ఈ సందర్భంగా చర్చించనుంది. దేవాలయాల్లో చైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి పచ్చ జెండా ఊపే అవకాశముందని తెలుస్తుంది.

Also Read: ట్రాఫిక్‌లో చిక్కుకున్నారా? ఇలా చేయండి.. జస్ట్ సెకన్‌లో పోలీసులు మీకు ఫోన్ చేస్తారు..?


దీపావళి నుంచి ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకంపై చర్చ..

రాష్ట్రంలో స్వర్ణకారుల వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఈ క్యాబినెట్‌లో ఆమోదముద్ర పడనుంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ జిఓలు ఉండే goir.ap.gov.in వెబ్‌సైట్‌ను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించింది.

Also Read: పండగ వేళ.. పలు ప్రత్యేక రైళ్లు


వైసీపీ హయాంలో అప్‌ లోడ్ చేయకుండా మాన్యువల్‌గా జారీ చేసిన జీవోలను సైతం జీవో ఐఆర్ సైట్లో అప్‌ లోడ్ చేయాలని ఈ కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తుంది. వైసీపీ హయాంలో రహస్యంగా ఇచ్చిన జీవోలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచేందుకు సైట్‌లో ప్రత్యేక బటన్ తీసుకు రావాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తుంది.


తద్వారా గత ప్రభుత్వం జారీ చేసిన అక్రమ జీవోలు, అడ్డగోలు నిర్ణయాలను ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ ద్వారా వచ్చే కేసులను త్వరిత గతిన పరిష్కరించేందుకు స్పెషల్, ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానాలు ఏర్పాటు చేసేందుకు ఈ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనుందని తెలుస్తుంది.


అలాగే రాష్ట్రంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు సవరణలు చేయనుంది. వరదలు వచ్చిన ప్రాంతంలో తనకా... స్టాంపు డ్యూటీ మాఫీ తదితర అంశాలపై ఈ కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. నూతన ప్రభుత్వం రూపొందించిన పాలసీలపై ఈ కేబినెట్‌లో చర్చించి.. వాటికి సైతం ఆమోద ముద్ర వేసే అవకాశముందని సమాచారం.

For AndhraPradesh News And Telugu News..

Updated Date - Oct 15 , 2024 | 07:41 PM