Home » Chandrababu Cabinet
చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఆ క్రమంలో దీపావళి పండగ వేళ.. మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. అందుకోసం బుధవారం అంటే.. అక్టోబర్ 16వ తేదీ ఉదయం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
కూటమి ప్రభుత్వం జోరు పెంచింది. విధ్వంస పాలనను చూసిన రాష్ట్రానికి కొత్త విజన్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్దమైంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను అందించే లక్ష్యంతో రూపొందిస్తున్న పాలసీలకు చంద్రబాబు ప్రభుత్వంతుది మెరుగులు దిద్దుతోంది. ఈ పాలసీలు త్వరలోనే కేబినెట్ ముందుకు రానున్నాయి.
భారీ వర్షాలతో విజయవాడ నగరానికి వరద నీరు పోటెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. వరద నష్టంపై ఉన్నతాధికారులతో చంద్రబాబు కేబినెట్లోని పలువురు మంత్రులు సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వ్యతిరేక ప్రచారానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ఈ ప్రచారంపై ఐటీడీపీ తనదైన శైలీలో స్పందించింది. ఈ సందర్బంగా వైసీపీకి ఐటీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.
దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్(ఏపీ) భవన్‌కు నూతన భవన నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఎవ్వరూ తగ్గొద్దు.. అస్సలు తగ్గొద్దంటే తగ్గొద్దు అంతే..! గట్టిగా ఇచ్చి పడేయండి.. ఇందులో ఏ మాత్రం వెనుకంజ వేయొద్దు..! వైసీపీ (YSR Congress) చేసే రాజకీయ విమర్శలకు మంత్రులందరూ ధీటుగా బదులిచ్చి తీరాల్సిందే..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీతో ఉండేది కార్యకర్తలే..వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ లభించింది. ఆమెకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి హోం మంత్రిత్వ శాఖ దక్కించుకున్న తొలి వ్యక్తిగా ఆమె అరుదైన గుర్తింపుపొందారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఎంతోమంది మంత్రులుగా పనిచేశారు. అయితే హోం మంత్రిగా పనిచేసే అవకాశం మాత్రం ఎవరికీ లభించలేదు.
మంత్రివర్గంలో కొత్త తరానికి పెద్దపీట వేసిన సీఎం చంద్రబాబు.. శాఖల కేటాయింపులోనూ అదే ఒరవడి కొనసాగించారు. నవతరానికి పెద్ద బాధ్యత లు అప్పగించారు. ఇదే సమయంలో పాతతరానికీ ప్రాధాన్యం కొనసాగించా రు. ప్రతిభ, సామర్థ్యం, నేపథ్యం, అనుభవానికి నడుమ సమతూకం
సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం చంద్రబాబు.. తన సహచర మంత్రుల కు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ