Share News

Chandrababu: ఉద్దండ రాయునిపాలెంలో ప్రణమిల్లిన ఏపీ సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 20 , 2024 | 01:10 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాజధాని అమరావతి నిర్మాణాల పరిశీలించారు. ఉండవల్లిలో గల నివాసం నుంచి బయల్దేరి ప్రజా వేదిక శిథిలాలను పరిశీలించారు. అక్కడి నుంచి ఉద్దండ రాయునిపాలెం వెళ్లారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూశారు. ఆ ప్రాంతంలో పాడుబడినట్టు ఉండటంతో ఉద్వేగానికి గురయ్యారు. మరోసారి అక్కడ ప్రణమిల్లారు.

Chandrababu: ఉద్దండ రాయునిపాలెంలో  ప్రణమిల్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈ రోజు రాజధాని అమరావతి నిర్మాణాల పరిశీలించారు. ఉండవల్లిలో గల నివాసం నుంచి బయల్దేరి ప్రజా వేదిక శిథిలాలను పరిశీలించారు. అక్కడి నుంచి ఉద్దండ రాయునిపాలెం వెళ్లారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూశారు. ఆ ప్రాంతంలో పాడుబడినట్టు ఉండటంతో ఉద్వేగానికి గురయ్యారు. మరోసారి అక్కడ ప్రణమిల్లారు. ఇదివరకు సేకరించిన మట్టికి పూజలు నిర్వహించారు.


సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన ఆల్ ఇండియా ఉద్యోగులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాంతాలకు వెళతారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాల్ల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. జై చంద్రబాబు, జై అమరావతి అని నినాదించారు.

Updated Date - Jun 20 , 2024 | 01:12 PM