Share News

Pawan Kalyan: పవన్ కల్యాణ్ వెంటే శేషేంద్ర శర్మ పుస్తకం

ABN , Publish Date - Jun 19 , 2024 | 12:56 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రచనల ప్రభావం ఎక్కువే. ఆయన నచ్చేందే చేస్తారు. మెప్పు కోసం ప్రయత్నించారు. ఇష్టపడింది కష్టమైనా సాధించాలని అనుకుంటారు. ఒకరి పంథాలో వెళ్లరు. మన స్టైల్ మనదే అంటారు. ఒకరిలా బతకడం కాదు.. మనం మనలా బతకాలని అంటారు. పనిలో పులిలా ఉంటారు. ప్రైవసిని ఆశిస్తారు. స్టార్ హోదా పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ వెంటే శేషేంద్ర శర్మ పుస్తకం
Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రచనల ప్రభావం ఎక్కువే. ఆయన నచ్చేందే చేస్తారు. మెప్పు కోసం ప్రయత్నించారు. ఇష్టపడింది కష్టమైనా సాధించాలని అనుకుంటారు. ఒకరి పంథాలో వెళ్లరు. మన స్టైల్ మనదే అంటారు. ఒకరిలా బతకడం కాదు.. మనం మనలా బతకాలని అంటారు. పనిలో పులిలా ఉంటారు. ప్రైవసిని ఆశిస్తారు. స్టార్ హోదా పక్కన పెట్టి సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడతారు. వృత్తి, ప్రవృత్తిని సమానంగా ముందకు తీసుకెళుతున్నారు. అభిమానులనే కాదు జనంతో మమేకం అవుతారు. పవన్ కల్యాణ్‌లో ఓ విలక్షణ ఉంది. సాహిత్యంపై ఆసక్తి. ఆయనను కదిలించిన గొప్ప పుస్తకం ‘ఆధునిక మహాభారతం’.

book-2.jpg


book-1.jpg

తెలుగు సాహిత్యంలో ప్రభంజనం సృష్టించిన గుంటూరు శేషేంద్ర శర్మ ఆ పుస్తకం రాశారు. కవిసేన మేనిఫెస్టే, కాలరేఖ వంటి సంచలన గ్రంథాలు కూడా ఆయన రాశారు. ఆధునిక మహాభారతం పుస్తకం పవన్ కల్యాణ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ పుస్తకం చదివినప్పటి నుంచి తన వెంటే ఉంచుకుంటున్నారు. ఎక్కడికెళ్లిన తన వెంట తీసుకెళుతున్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను చేపట్టిన సమయంలో కూడా తన వద్ద పుస్తకం ఉంచుకున్నారు. ఆ పుస్తకంలో కొన్ని పదాలను పవన్ కల్యాణ్ రాశారు. ఒక ‘దేశపు సంపద ఖనిజాలు కాదు. నదులు, అరణ్యాలు కాదు. కలలు ఖనిజాలతో చేసిన యువత. మన దేశ భవిష్యత్తుకు నావికులు అని మహాకవి శేషేంద్ర శర్మ మాటలు నన్ను అమితంగా ప్రభావితం చేశాయి అని’ పవన్ కల్యాణ్ రాశారు.

book-3.jpg

Updated Date - Jun 19 , 2024 | 01:49 PM