Share News

AP State : ఇంధన పొదుపులో ఈ ఏడాదీ మనమే టాప్‌

ABN , Publish Date - Dec 21 , 2024 | 05:10 AM

ఈ ఏడాది కూడా ఇంధన పొదుపులో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వెల్లడించారు.

AP State : ఇంధన పొదుపులో ఈ ఏడాదీ మనమే టాప్‌

అమరావతి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది కూడా ఇంధన పొదుపులో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వెల్లడించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక యూనిట్‌ ఆదా చేస్తే రెండు యూనిట్లు పొదుపు చేసినట్లేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో సోలార్‌ పరికరాల వినియోగం పెరగాలన్నారు. విజన్‌ 2047లో భాగంగా రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అవార్డును దక్కేందుకు కృషి చేసిన రాష్ట్ర ఎనర్జీ ఎఫిషియెన్సీ లిమిటెడ్‌ (ఏపీఈఈఎ్‌సఎల్‌) సీఈవో, ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి బీఏవీపీ కుమారరెడ్డిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్‌ చక్రధరబాబు, ట్రాన్స్‌ కో జేఎండీ కీర్తి చేకూరి, సీపీడీసీఎల్‌ ఎండీ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపులో అవార్డులు సాధించిన వారికి విజయనంద్‌ జ్ఞాపికలు బహూకరించారు.

Updated Date - Dec 21 , 2024 | 05:11 AM