Share News

AP Assembly Sessions: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై ఏపీ అసెంబ్లీలో చర్చ

ABN , First Publish Date - Jul 24 , 2024 | 11:56 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది.

AP Assembly Sessions: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై ఏపీ అసెంబ్లీలో చర్చ
AP Assembly Sessions

Live News & Update

  • 2024-07-24T17:41:08+05:30

    జీవో 217ను రద్దుచేస్తూ నిర్ణయం: మంత్రి అచ్చెన్నాయుడు

    • జీవో 217ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

    • మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని నిర్ణయం.

    • అసెంబ్లీ ప్రశ్నోత్తారాల్లో భాగంగా ఈమేరకు సమాధానం ఇచ్చిన మంత్రి.

    • చెరువులను, మత్స్యకారుల సోసైటిలకు ఇచ్చి వారి జీవన విధానాన్ని మెరుగుపరుస్తాం.

    • జీవో 217 తీసుకువచ్చి మత్స్యకార సోసైటీల పరిధిలో ఉన్న చెరువులను వైసీపీ కార్యకర్తలు దోచేశారు.

    • మత్స్యకారుల మెడకు జీవో నంబర్ 217తో జగన్ ఊరితాడు వేశారు.

    • ఇప్పుడు ఆ జీవోను రద్దుచేసి వారికి మేలు చేశాం.

  • 2024-07-24T16:39:13+05:30

    వారిని ఎట్టి పరిస్ధితుల్లో వదల కూడదు: డిప్యూటీ సీఎం పవన్

    • మద్యంలో చాలా లోతైన విచారణ జరగాలి.

    • ఎంతో దోపిడీ దీనిలో జరిగింది.

    • రూ. 15,000 కోట్లు కేంద్రం ఇస్తే ఆనందం వ్యక్తం చేశాం.

    • అయితే రాష్ట్రంలో ఎన్నివేల కోట్లు మధ్యంలో దోపిడి జరిగింది.

    • ఆ సోమ్ము వచ్చి ఉంటే ఎప్పుడో పోలవరం పూర్తయి ఉండేది.

    • ఇంత దోపిడీ చేసిన వారిని ఎట్టి పరిస్ధితుల్లో వదల కూడదు.

    • రాజకీయ కక్షసాధింపు కాదు తప్పుచేసిన వారికి శిక్ష పడి తీరాలి అని ముఖ్యమంత్రి గారిని కోరతున్నా.

  • 2024-07-24T16:05:36+05:30

    లిక్కర్ పాలసీపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..

    Liqour-Policy-in-AP.jpg

    • రాష్ట్ర ఆదాయాన్ని దోచేయడం.. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వారిపై విచారణకు సిద్ధంగా ఉన్నాం.

    • గత ఐదేళ్లలో ఎంతమంది ఆరోగ్యం దెబ్బతిన్నదో, ఎంత మంది చనిపోయారో లెక్కలు తీస్తాం.

    • ఈ లిక్కర్ అంశంలో సీబీసీఐడీ ఎంక్వైరీకి ఆదేశంతో పాటు ఈడి ఎంక్వైరీ కూడా కోరుతాం.

  • 2024-07-24T13:42:08+05:30

    మంత్రి అనగాని సత్య ప్రసాద్

    చట్ట వ్యతిరేకం అయిన నల్ల చట్టం రద్దుకు సభ అంగీకరించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాం

    వైసీపీ ఫ్లోర్ లీడర్ ప్రచార ఆర్బాటం, అధికార మదంతో ఈ చట్టాన్ని తెచ్చారు

    ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రిపీల్ బిల్లు 2024ను ఆమోదించిన ఏపీ శాసనసభ

  • 2024-07-24T12:48:22+05:30

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    • ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు కోసం రెవెన్యూ మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు

    • ఆలోచన లేకుండా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. న్యాయవాదులు కూడా దీనికి వ్యతిరేఖంగా ఆందోళనలు చేశారు

    • రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ వివాదాలు పెరిగిపోయాయి

    • ఈ ఐదేళ్లలో కుప్పంలో కూడా భూ వివాదాలుపై ఫిర్యాదులు వచ్చాయి

    • ఏదైనా భూమిని 22ఏ అని వేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది

    • ప్రభుత్వం ఒప్పకుంటే తిరిగి ప్రైవేటు భూమిగా మార్చేస్తారు

    • నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే రికార్డులు మార్చడం ఈజీ అయిపోయింది

    • భూమి తరతరాలుగా వారసత్వం ప్రకారం వస్తోంది

    • భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తాం రాజముద్ర వేస్తాం

    • సీఎం బొమ్మవేసి అప్పట్లో పాస్ పుస్తకాలు ఇచ్చారు

    • భూసర్వే ద్వారా వివాదాలు పెరిగాయి అందుకే హోల్డ్ చేశాం

    • ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి ఉంది

    • ఎంతమంది హైకోర్టుకు భూ వివాదాలపై వెళ్లగలుగుతారు

    • సాక్షిలో పనిచేసే వారినందరిని ప్రభుత్వంలో పెట్టారు

    • వారి గుమస్తాలను పెడితే మన జాతకాలు వాళ్లు రాస్తారు

    • ఎవరైనా ఈ భూమి నాది అంటే అది ల్యాండ్ ట్రిబ్యూనల్‌కు వెళ్లిపోతుంది

    • తద్వారా ప్రైవేటు ఆస్తులు లాగేయాలని చూసారు

    • ఈ చట్టం వారసత్వ చట్టానికి విరుద్దంగాఉంది. ఈచట్టంలో ఉన్న పలు సెక్షన్లు రాజ్యాంగ విరుద్దంగా ఉంది,

    • ఈ చట్టానికి సంబంధించి తెచ్చిన 512 జీవోను రహస్యంగా ఉంచారు

    • మేము వచ్చాక చట్టాన్ని రద్దు చేస్తామన్నాం

    • ఇతర దేశాల్లో ఉన్నవారి భూములు రికార్డులు మార్చితే 2 ఏళ్ల లోపు గుర్తించకపోతే ‘డీమ్డ్ టూ బీ’ అని పెట్టేస్తారు

    • ఈ నల్ల చట్టానికి సభ్యలు అందరూ కలిసి మంగళంపాడాలి అని కోరుతున్నా

  • 2024-07-24T12:41:39+05:30

    Nara-Lokesh.jpg

    3 తరగతి విద్యార్థులకు టోఫెల్ శిక్షణపై మండలిలో చర్చ..

    • మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఏబీసీడీ నేర్చుకోవాల్సిన వయస్సులో టోఫెల్ శిక్షణ అవసరమా అని ప్రశ్నించిన జనసేన ఎమ్మెల్సీ హరి ప్రసాద్

    • టోఫెల్ శిక్షణ కోసం ఈటీఎస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు

    • రూ.1,052 కోట్లతో ఈటీఎస్‌తో గత ప్రభుత్వం ఒప్పందంపై సమీక్ష చేయాలన్న హరిప్రసాద్

    • పిల్లల మానసిక వత్తిడిపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్య

    • ఇంజనీరింగ్ పూర్తి అయి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టోఫెల్ శిక్షణ ఉంటుంది

    • అలాంటి టోఫెల్ 3వ తరగతి నుంచి అమలు పెట్టడం సరైంది కాదు

    • టీచర్స్ కూడా ఈ అంశంపై ఇబ్బందులు పడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది

    • విద్యా రంగం సమస్యలపై అందరితో చర్చించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్న నారా లోకేశ్

  • 2024-07-24T12:38:20+05:30

    శాసన మండలిలో నారా లోకేశ్

    • తల్లికి వందనంపై అపోహలు వద్దు

    • ఎంత మంది పిల్లలు ఉన్న తల్లి వందనం అమలు చేస్తాం

    • ప్రభుత్వ - ప్రైవేట్ రెండు పాఠశాలలో చదివే పిల్లలకు వర్తిస్తుంది

    • అమ్మకి వందనంలో లోపాలపై సరిరిద్ది తల్లికి వందనం అమలు చేస్తాం

  • 2024-07-24T12:01:51+05:30

    • ప్రశ్నోత్తరాల సమయంలో కృష్ణపట్నం పోర్టు అంశంపై చర్చ..

    • కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టును అదానీ తొలగించడంపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆవేదన

    • కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు కోసం అదానీ కాళ్లు పట్టుకుంటానన్న సోమిరెడ్డి

    • కృష్ణపట్నంలోని కంటైనర్ పోర్టును అదానీ సంస్థ తీసేయడం వల్ల తీవ్ర నష్టం చేకూరుతోందన్న విచారం

    ‘‘తరలిపోయిన కంటైనర్ పోర్టును కృష్ణపట్నానికి తీసుకురావాలని అదానీ కాళ్లైనా పట్టుకుంటా. కంటైనర్ పోర్టు వెళ్లిపోవడం వల్ల 10 వేల మంది ప్రత్యక్షంగా ఉపాధిని కోల్పోయారు. పోర్టు కోసం భూములిచ్చాం. కంటైనర్ పోర్టు ఎత్తేయడం వల్ల మా ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. గతంలో అమరావతి నిర్మాణ పనుల కోసం కావాల్సిన ఎక్విప్‌మెంట్ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు ద్వారానే దిగుమతి అయ్యేవి. కంటైనర్ పోర్టు ఎత్తేయడం వల్ల మొత్తంగా 25 వేల ఎకరాల్లో ఉన్న వివిధ ఎస్ఈజెడ్‌లలోని కార్యకలాపాలు నష్టపోతున్నాయి. కంటైనర్ పోర్టు ఎత్తేసి.. బూడిద తరలించే బల్క్ కార్గో పోర్టు ఉండడం వల్ల లాభమేంటీ? కృష్ణపట్నం పోర్టు కోసం సేకరించిన భూమి ఏమైపోతుంది?. కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టు తరలించడం వల్ల ఒక్క ఆక్వా రంగానికే నెలకు రూ.1000 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. కంటైనర్ పోర్టు తరలిపోతోంటే మారిటైం బోర్డు ఏం చేస్తోంది. గోళ్లు గిల్లుకుంటోందా?’’ అని సోమరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.

  • 2024-07-24T11:50:50+05:30

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది. అవకతవకలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని పర్చూరు ఎంఎల్ఏ సాంబశివ రావు ప్రశ్నించారు. జేపీ వెంచర్స్ రూ.842 కోట్లు ప్రభుత్వానికి బకాయి పడిందని, అయినా వారికి ఎటువంటి బకాయిలు లేవని ఆనాటి ఏపీఎండీసీ ఎండీ వెంకట రెడ్డి ఎన్‌వోసీ ఇచ్చారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘‘

    వీళ్లు ఎంత మేరకు తవ్వారు అనే అంశంపై శాటిలైట్ ఇమేజెస్ ద్వారా దర్యాప్తు చేయిస్తున్నామని అన్నారు. ఇసుక అవకతవకలపై చాలా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇసుకపై సభ్యులు చెప్పిన విషయాలు అన్నీ కఠిన వాస్తవాలు అని స్పీకర్ అన్నారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ అన్నారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.