-
-
Home » Andhra Pradesh » AP assembly sessions live updates from Amaravati as TDP and Janasena and YSRCP and BJP Prepared live updates psnr
-
AP Assembly Sessions Live updates: అసెంబ్లీ సమావేశాలు షురూ.. పూర్తయిన గవర్నర్ ప్రసంగం
ABN , First Publish Date - Jul 22 , 2024 | 09:29 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలుపెట్టారు.
Live News & Update
-
2024-07-22T12:22:58+05:30
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కూటమి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశం
సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అసెంబ్లీలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం
-
2024-07-22T11:57:02+05:30
బీఏసీ సమావేశం ప్రారంభం
హాజరు కాని వైసీపీ
హాజరైన జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు
జనసేన తరపున నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున విష్ణు కుమార్ రాజు హాజరు
-
2024-07-22T11:33:06+05:30
మాజీ సీఎం జగన్ భుజంపై చేయి వేసిన మాట్లాడిన రఘురామ కృష్ణరాజు
అసెంబ్లీ హాల్లో ఆసక్తికర దృశ్యం
జగన్‌తో భుజంపై చేయి వేసి మాట్లాడిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు
కనిపించిన వెంటనే ‘హాయ్ జగన్’ అని పలుకరింపు
రోజు అసెంబ్లీకి రా జగన్ అని కోరిన రఘురామ
అసెంబ్లీకి ప్రతిరోజూ వస్తే బాగుంటుందని వ్యాఖ్య
రెగ్యులర్ వస్తాను... మీరే చూస్తారుగా అని బదులిచ్చిన జగన్
ప్రతిపక్షం లేకపోతే ఎలా అని అన్న రఘురామ
జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడిన రఘురామ
తనకు జగన్ ప్రక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్‌ను కోరిన ఆర్ఆర్ఆర్
తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్లిన కేశవ్
వైసీపీ ఎంఎల్ఏ, ఎమ్మెల్సీలు అందరూ రఘురామకు శుభాకాంక్షులు
-
2024-07-22T10:41:27+05:30
చంద్రబాబు విజనరీ నేత.. ప్రసంగంలో గవర్నర్ నజీర్
కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు
కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం ఏర్పడింది
చంద్రబాబు విజనరీ నేత
2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు కృషి
2014లో ఏపీలో పెట్టుబడుల వరద.. అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ముందుకువచ్చాయి
రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషి
ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది
2019 నుంచి ఏపీలో నష్టాలు చవిచూసిన అన్ని రంగాలు
-
2024-07-22T10:26:47+05:30
సభ నుంచి బయటకు వైసీపీ నేతలు
ఏపీ అసెంబ్లీ సభ నుంచి బయటకు వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే బయటకు వచ్చిన జగన్
-
2024-07-22T10:24:19+05:30
సభలో సీఎం చంద్రబాబు
-
2024-07-22T10:09:34+05:30
‘సేవ్ డెమొక్రసీ’ ‘హత్యా రాజకీయాలు నశించాలి’ అంటూ నినాదాలు
గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యుల నినాదాలు
స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు
నినాదాల నేపథ్యంలో గవర్నర్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి
-
2024-07-22T10:08:45+05:30
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం మొదలుపెట్టిన గవర్నర్ నజీర్
-
2024-07-22T10:05:33+05:30
అసెంబ్లీ వద్ద పోలీసులను బెదిరించిన వైఎస్ జగన్!
అసెంబ్లీ గేటు వద్ద వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్
విధుల్లో ఉన్న పోలీసులపై వైఎస్ జగన్ అనుచిత ప్రవర్తన
రోజులు ఇలాగే ఉండవంటూ బహిరంగంగా పోలీసులను బెదిరించిన వైఎస్ జగన్
ప్లకార్డులు, నల్ల కండవాలతో అసెంబ్లీకి వస్తున్న జగన్‌ని అడ్డుకున్న పోలీసులు
ప్లకార్డ్స్, నల్ల కండవాలు తొలగించాలని పోలీసులకు ఎవరు ఇచ్చారు అధికారం అంటూ ప్రశ్నించిన జగన్
-
2024-07-22T10:01:21+05:30
టెన్షన్ టెన్షన్.. పోలీసులకు జగన్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం
నల్ల కండవాలు ప్లే కార్డ్స్‌తో అసెంబ్లీకి వస్తున్న మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు
అడ్డుకున్న పోలీసులు
పోలీసులు, జగన్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం
పోలీసుల తీరుపై మండిపడ్డ వైఎస్ జగన్
-
2024-07-22T09:52:59+05:30
ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు
వెంకటపాలెం లో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు అచ్చెం నాయుడు, కొలుసు పార్థసారథి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పైలా శ్రీనివాస్ నివాళులర్పించారు.
అనంతరం అసెంబ్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు
-
2024-07-22T09:45:22+05:30
అసెంబ్లీకి నల్ల కండువాలతో వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఫైర్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నడుచుకుంటూ అసెంబ్లీకి రానున్న వైసీపీ అధినేత జగన్
-
2024-07-22T09:40:02+05:30
ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు
-
2024-07-22T09:35:28+05:30
అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారుకు అనుమతి
అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వైఎస్ జగన్ కారును అనుమతించేందుకు ప్రభుత్వం నిర్ణయం
సాధారణంగా ఎమ్మెల్యే లు అసెంబ్లీ 4 వ నంబరు గేటు బయట దిగి లోపలికి వెళ్లాలని చెబుతున్న నిబంధనలు
ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనం తీసుకోవాలని నిర్ణయం
వైసీపీ శాసన సభపక్ష విన్నపం మేరకు ప్రభుత్వం సానుకూలం నిర్ణయం
-
2024-07-22T09:28:26+05:30
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీ ఎజెండా, పని దినాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చకు ఆమోదం తెలపనున్నారు. బుధవారం నుంచి వరుసగా సభ ముందు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ శ్వేత పత్రాలను ఉంచనుంది.
శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వరుసగా మూడు శ్వేత పత్రాలను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలియజేస్తామని ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించారు. రేపటికల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ రావాలంటూ ముందుగానే హుకుం జారీ చేశారు. ఓవైపు శాసనసభ జరుగుతుండగా ఇక్కడ ఉండకుండా ఢిల్లీ వెళ్లి ప్రయోజనం ఏంటని పార్టీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. సభ జరుగుతుండగా బయట ఆందోళన చేయడం కంటే సభలో అంశాలను ప్రస్తావిస్తే ఉపయోగమంటూ సూచిస్తున్నారు.